వినోదం

Balakrishna : ఆ ద‌ర్శ‌కుడితో బాల‌య్య తీసిన సినిమాలు అన్నీ ఫ్లాప్‌.. ఏవి అంటే..?

Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. మరోవైపు శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారు దర్శకేంద్రుడు. అయితే బాల‌కృష్ణ‌-రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

1974లో త‌మ సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ రామారావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాత‌మ్మ‌క‌ల సినిమాలో బాల‌కృష్ణ బాల‌న‌టుడిగా వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయ‌న కొడుకుగా, స్నేహితుడిగా న‌టించ‌డం ప్రారంభించారు. ఆ స‌మ‌యంలోనే ఎన్టీఆర్‌తో కే.రాఘ‌వేంద్ర‌రావు ఓ చిత్రాన్ని నిర్మించారు. ఇది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 1980 రామ‌కృష్ణ సినీ స్టూడియోస్‌, కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రౌడీ రాముడు కొంటె కృష్ణుడు సినిమా విడుద‌ల అయింది.

balakrishna movies with this director are flop

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, శ్రీ‌దేవి, బాలకృష్ణ‌, రాజ్య‌ల‌క్ష్మి క‌లిసి న‌టించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింద‌నే చెప్పాలి. ఇక ఆ త‌రువాత బాల‌కృష్ణ సోలో హీరోగా 1985 రామ‌కృష్ణ సిని స్టూడియోస్ కే.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్టాభిషేకం చిత్రం విడుద‌ల అయింది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ, విజ‌య‌శాంతి హీరో, హీరోయిన్లుగా న‌టించారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ అందించ‌గా.. చ‌క్ర‌వ‌ర్తి బాణిలు స‌మ‌కూర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలప‌డింది. మొత్తానికి బాల‌కృష్ణ – రాఘ‌వేంద్ర‌రావు కాంబోలో వచ్చిన 3 సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి.

Admin

Recent Posts