హెల్త్ టిప్స్

Weight Loss Drink : ఈ డ్రింక్ తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.. కొన్ని రోజుల్లోనే ఫలితం మీకే తెలుస్తుంది..

Weight Loss Drink : గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చిన మార్పులతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది. అధిక బరువు ఉండటం గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. బరువు పెరిగినంత సులువు కాదు బరువు తగ్గటం. ఎన్నో వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించినప్పటికీ కొందరు ఎంతకూ బరువు తగ్గరు. అయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఓ మంచి మ్యాజిక్ డ్రింక్ గురించి తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రేడియన్స్.. వాము, సోంపు, జీలకర్ర.

ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో చూద్దాం.. వాము, సోంపు, జీలకర్ర మూడింటిని ఒకొక్క స్పూన్ చొప్పున తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక గిన్నెలో కప్పున్నర నీటిని తీసుకొని దానిలో వాము, సోంపు, జీలకర్ర కలిపి చేసుకున్న పొడి ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపి 5 నిమిషాల పాటు మరిగించి గ్లాస్ లోకి వడగట్టి గోరువెచ్చగా అయ్యాక త్రాగాలి. ఈ డ్రింక్ ని క్రమం తప్పకుండా ప్రతి రోజు ఉదయం నెల రోజుల పాటు తీసుకోవాలి. ఈ డ్రింక్ ఉదయం పరగడుపున త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. త్రాగిన గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి.

taking this weight loss drink works effectively

ఈ డ్రింక్ త్రాగటం వలన మలబద్దకం మరియు గ్యాస్, ఎసిడిటీ సమస్య, కడుపు ఉబ్బరం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవటం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. వాము, సోంపు, జీలకర్ర మూడింటిని సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా ప్రతి రోజు ఈ డ్రింక్ త్రాగుతూ ఉంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు, అధిక బరువు సమస్య తొలగిపోతుంది. అంతేకాక శరీరానికి హానికరంగా ఉండే టాక్సీన్స్ ని బయటకు పంపటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.

Admin

Recent Posts