వినోదం

Viral Photo : ఈ ఫొటో ఉన్న చిన్నారి హీరోయిన్ మాత్ర‌మే కాదు.. బాక్స‌ర్ కూడా.. గుర్తు ప‌ట్టారా..

Viral Photo : టాలీవుడ్ కి అందాల ముద్దుగుమ్మ‌లు చాలా మందే ప‌రిచ‌యం అవుతున్నారు. ప‌రాయి రాష్ట్రానికి చెందిన భామ‌ల‌కి మంచి గుర్తింపు వ‌స్తుంది. వెంకటేష్ నటించిన `గురు` చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది అందాల భామ రితికా సింగ్. ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే వేసారు క్రిటిక్స్. అయితే రితిక తెలుగు సినీపరిశ్రమలో ఆశించినంత గా బిజీకాలేకపోయింది. ప్రస్తుతానికి తమిళంలోనే అడపాదడపా నటిస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తుంది రితిక.

ముంబయిలో పుట్టిపెరిగిన రితిక‌.. చిన్నప్పటి నుంచి మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. తండ్రి ట్రైనింగ్ లో రాటుదేలి ‘సూపర్ ఫైట్ లీగ్’ తొలి సీజన్ లో పార్టిసిపేట్ చేసింది. ఇక డైరెక్టర్ సుధా కొంగర.. తన తొలి సినిమా కోసం నిజమైన బాక్సర్ ని వెతికే క్రమంలో రితిక కనిపించింది. అలా ఈమెతో ‘సాలా ఖాదూస్/ఇరుది సుట్రూ’ చేసింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో తెలుగులో గురు సినిమా చేసిది. ఇక్కడ కూడా హిట్ అయింది. దీంతో బాక్సర్ కాస్త హీరోయిన్ అయిపోయింది. గురు త‌ర్వాత ప‌లు తెలుగు సినిమాలు చేసిన ఈ అమ్మ‌డికి పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు.

rithika singh child hood photo viral

త‌మిళంలో శివలింగ, ఓ మై కడవులే లాంటి సినిమాలు చేసి హిట్స్ కొట్టింది. ఇదంతా పక్కనబెడితే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేసే ఈమె.. నెటిజన్లను బాగానే ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది.తాజాగా రితికా కి సంబంధించిన చిన్న‌ప్ప‌టి ఫొటో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారుతుంది. ఇందులో రితికా క్యూట్ లుక్‌లో క‌నిపించి క‌నువిందు చేస్తుంది. రితికా పిక్స్ చూసి స‌ర్‌ప్రైజ్ అవుతున్నారు.

Admin

Recent Posts