వినోదం

Actress : తెలంగాణ నుంచి వ‌చ్చి.. స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన భామ‌లు ఎవరో తెలుసా..?

Actress : సినిమా రంగం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఎంతమంది వారసులు వచ్చినా టాలెంట్ లేనిదే ఇక్కడ ఎవరూ నిలదొక్కుకోలేరు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైంది సినిమా. అయితే కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రా ప్రాంత నుంచి వచ్చిన వారే ఏలుతూ వచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ కూడా రాణిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు సైతం రాణిస్తున్నారు. ఇప్ప‌టికే నితిన్, విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోలుగా స‌క్సెస్ అయ్యారు. ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే అతితక్కువ మంది ఉన్నారు.. వారెవరంటే..

తొలిప్రేమ సినిమాలో ప‌వ‌న్ తో జ‌త‌క‌ట్టిన హీరోయిన్ కీర్తిరెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందినదే. నిజామాబాద్ జిల్లాకు చెందిన కీర్తిరెడ్డి తొలిప్రేమ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ను త‌న‌వైపు తిప్పుకుంది. ఆ త‌ర‌వాత మ‌హేశ్ బాబు అర్జున్ సినిమాలో సోద‌రి పాత్ర‌లో నటించింది. సీనియ‌ర్ హీరోయిన్ సంగీత తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. వ‌రంగల్ కు చెందిన సంగీత సినిమాల్లో ఎన్నో అవ‌కాశాలు అందుకున్నారు. హీరోయిన్ గా గుడ్ బై చెప్పాక తల్లి పాత్ర‌లు చేశారు. హీరోయిన్ విజ‌య‌శాంతి కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన‌వారే. వ‌రంగ‌ల్ లో పుట్టిన విజ‌య‌శాంతి చెన్నైలో చ‌దువుకున్నారు.

do you know that these actress are from telangana

ఓసేయ్ రావుల‌మ్మ‌, అడ‌విచుక్క‌, కర్త‌వ్యం, ప్ర‌తిధ్వని లాంటి ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా న‌టించి, మెప్పించారు. ఈరోజుల్లో సినిమాతో హీరోయిన్ ప‌రిచ‌య‌మైన రేష్మా రాథోడ్ సైతం తెలంగాణ‌లోని ఇల్లందు ప్రాంతానికి చెందిన‌ది. బాడీగార్డ్, ల‌వ్ సైకిల్ సినిమాల్లో రేష్మా హీరోయిన్ గా న‌టించింది. హీరోయిన్ ప్ర‌త్యూష కూడా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిందని ఎక్కువమందికి తెలియ‌దు. తెలంగాణ‌లోని భువ‌న‌గిరి ప్రాంతంలో ప్ర‌త్యూష జ‌న్మించింది. కెరీర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్ర‌లు చేసిన ప్ర‌త్యూష క‌లుసుకోవాల‌ని సినిమాలో ఉద‌య్ కిర‌ణ్ కు జోడీగా న‌టించింది. అయితే చిన్న‌వ‌య‌సులోనే అనుకోని కార‌ణాల వ‌ల్ల ప్ర‌త్యూష ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.

Admin

Recent Posts