ఆధ్యాత్మికం

వినాయకుడి శరీరంలోని భాగాలు దేనిని చూచిస్తాయో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందుగా ఆ కార్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని వినాయకుడికి పూజలు చేస్తాము. ముందుగా వినాయకుడి పూజ అనంతరమే ఇతర పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తాము. వినాయకుడు చూడగానే నాలుగు చేతులు కలిగి ఉండి, గజముఖం, కలిగి ఉంటాడు. అయితే వినాయకుడి శరీరంలోని ప్రతి భాగం ఒక్కో దానికి సంకేతం. మరి వినాయకుడి శరీరంలోని ఏ భాగం దేనిని సూచిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

చూడగానే వినాయకుడి తల మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. తల పెద్దదిగా ఉండటం వల్ల వినాయకుడికి తెలివితేటలు ఎక్కువ. వినాయకుడి తొండం ఎప్పుడు ఎడమవైపు తిరిగి ఉండి ఓంకారాన్ని చూపిస్తుంది. ఎడమ వైపు సూచించడం వల్ల చంద్రుని శక్తి మనలో ప్రసారమవుతుంది. అదే కుడివైపుకు ఉంటే సూర్యుడు శక్తి ప్రసారం అవుతుంది. వినాయకుడి చేతిలోని పద్మం సత్యానికి ప్రతీక, అదేవిధంగా మరొక చేతిలోని గొడ్డలి బంధాలకు సూచిక. మూడవ చేతిలోని లడ్డూ సంతోషానికి, అభయ ముద్ర భరోసాకు సంకేతం.

lord ganesha body parts and their explanations

వినాయకుడి పెద్ద చెవులు ఎక్కువగా వినటానికి చిన్న నోరు తక్కువ మాట్లాడటానికి, కళ్ళు ఏకాగ్రతను పెంచడానికి, ఏకదంతం సృష్టిలోని భిన్నత్వానికి సంకేతం.ఇక వినాయకుడి పెద్ద పొట్ట సుఖసంతోషాలను సమానంగా స్వీకరించడానికి సంకేతంగా సూచిస్తుంది.ఈ విధంగా వినాయకుడి శరీరంలోని ప్రతి భాగం ఒక్క విషయానికి సంకేతంగా నిలుస్తుంది.

Admin

Recent Posts