ఆధ్యాత్మికం

Temples For Moksham : ఈ ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటే చాలు.. మోక్షం ల‌భిస్తుంది, మాన‌వ జ‌న్మ ఉండ‌దు..!

Temples For Moksham : ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న‌కు ద‌ర్శించేందుకు అనేక ఆల‌యాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆల‌యాలు మాత్రం ఎంతో ప్ర‌ఖ్యాతిగాంచాయి. వాటికి ప్ర‌త్యేక‌మైన స్థ‌ల పురాణం ఉంటుంది. అలాంటి ఆల‌యాలు చాలానే ఉన్నాయి. అయితే మ‌నిషికి మోక్షం ప్ర‌సాదించే ఆల‌యాలు కూడా ఉన్నాయి. వాటిని సంద‌ర్శిస్తే ఇక మ‌నిషి జ‌న్మ మ‌ళ్లీ ఉండ‌ద‌ట‌. మోక్షం ల‌భిస్తుంద‌ట‌. సాక్షాత్తూ శివ స‌న్నిధానం ల‌భిస్తుంద‌ట‌. కైలాసం చేరుకుంటార‌ట‌. ఇక అలాంటి ఆల‌యాలు ఏవో, అవి ఎక్క‌డ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్త‌రాఖండ్‌లో ఉన్న బ‌ద్రీనాథ్ క్షేత్రం ఎంతో ప్ర‌సిద్ధిగాంచింది. ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి సంద‌ర్శిస్తే చాలు, ఇక మోక్షం ల‌భిస్తుంద‌ట‌. మ‌ళ్లీ జ‌న్మ ఉండ‌ద‌ట‌. ఇక్క‌డ జోషి మ‌ఠం ఉంది. దీన్ని కూడా సంద‌ర్శించాలి. దీంతో ఆత్మ ప‌రిశుద్ధం అవుతుంద‌ట‌. ఇక గుజ‌రాత్‌లో ఉన్న ద్వారక‌ను కూడా సంద‌ర్శించ‌వ‌చ్చు. ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నా చాలు, ఎంతో పుణ్యం ల‌భిస్తుంది. మోక్షం వ‌స్తుంది. మ‌ళ్లీ జ‌న్మ ఉండ‌దు. పాపాల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

visit these temples for moksham

ఒరిస్సాలోని పూరీ జ‌గ‌న్నాథ్ ఆల‌యాన్ని కూడా ద‌ర్శించుకోవాలి. ఈ క్షేత్రం కూడా ఎంతో పేరుగాంచింది. ఏటా ఇక్క‌డికి కొన్ని కోట్ల మంది భ‌క్తులు వ‌స్తుంటారు. పూరీ జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర ఎంతో ప్ర‌సిద్ధిగాంచింది. ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నా కూడా మోక్షం ల‌భిస్తుంద‌ని చెబుతారు. అలాగే త‌మిళ‌నాడులో ఉన్న రామేశ్వ‌రం ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నా చాలు మోక్షం ల‌భిస్తుంది. శివుడు అనుగ్ర‌హిస్తాడు. పాపాల నుంచి విముక్తిని క‌ల్పిస్తాడు. ఇలా ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటే మోక్షం పొంద‌వ‌చ్చు. మ‌ళ్లీ జ‌న్మ ఉండ‌దు. మాన‌వ జ‌న్మ నుంచి విముక్తి ల‌భిస్తుంది.

Admin

Recent Posts