Apartment : ఫ్లాట్‌కు, అపార్ట్‌మెంట్‌కు మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

Apartment : ఇళ్ల గురించి టాపిక్ వ‌స్తే స‌హ‌జంగానే చాలా మంది మాట్లాడుకునే వాటిల్లో ఫ్లాట్‌, అపార్ట్‌మెంట్ వంటివి వ‌స్తుంటాయి. కొంద‌రు ఫ్లాట్ కొన్నామ‌ని అంటే కొంద‌రు అపార్ట్‌మెంట్ తీసుకున్నామ‌ని చెబుతుంటారు. అయితే వినేందుకు రెండు మాట‌లు దాదాపుగా ఒకే తీరుగా ఉన్నా ఇవి చాలా మందిని క‌న్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. ఫ్లాట్ తీసుకుంటే దాన్ని అపార్ట్‌మెంట్ అని కూడా అన‌వ‌చ్చా..? అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఈ రెండింటికీ మ‌ధ్య తేడాలు ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా ఫ్లాట్ అంటే త‌క్కువ ఖ‌రీదు క‌ల‌వి అయి ఉంటాయి. ఒక హాల్‌, కిచెన్‌, మాస్ట‌ర్ బెడ్‌రూమ్‌, లివింగ్ రూమ్‌తోపాటు ఇత‌ర చిన్న రూమ్‌లు ఉంటాయి. అయితే ఇవ‌న్నీ ఒకే ఫ్లోర్‌లో ఉంటాయి. కానీ అపార్ట్‌మెంట్ అంటే అలా కాదు, ఇది ఎన్ని ఫ్లోర్‌ల‌లో అయినా ఉండ‌వ‌చ్చు. సాధార‌ణంగా సెల‌బ్రిటీలు అపార్ట్‌మెంట్‌ల‌లో ఉంటారు. వారి అపార్ట్‌మెంట్‌లు రెండు లేదా మూడు ఫ్లోర్‌ల‌లో ఉంటాయి. మొత్తం ఒకే ఇల్లు కానీ వేర్వేరు ఫ్లోర్‌ల‌లో ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే డూప్లెక్స్ లేదా ట్రిప్లెక్స్ ఇంటిని ఒక అపార్ట్‌మెంట్‌లో పెడితే ఎలా ఉంటుంది ? అలాగ‌న్న‌మాట‌. ఇలాంటి అపార్ట్‌మెంట్‌ల‌ను క‌లిపి పెద్ద భ‌వంతిని నిర్మిస్తారు. ఈ క్ర‌మంలో అపార్ట్‌మెంట్ ధ‌ర ఎక్కువ‌గానే ఉంటుంది.

do you know what is the difference between flat and Apartment
Apartment

ఇక అపార్ట్‌మెంట్‌లు మ‌న‌కు ఎక్కువ‌గా మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల్లో క‌నిపిస్తాయి. ఫ్లాట్‌ల‌ను మ‌నం ఎక్క‌డైనా స‌రే చూడ‌వ‌చ్చు. ఫ్లాట్‌ల‌లో 1బీహెచ్‌కే, 2బీహెచ్‌కే, 3బీహెచ్‌కే ఇలా ఉంటాయి. అపార్ట్‌మెంట్‌ల‌లో వీటికి అద‌నంగా మ‌రిన్ని రూమ్‌లు వివిధ ఫ్లోర్‌ల‌లో ఉంటాయి. ముంబైలో చాలా మంది సెల‌బ్రిటీలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇలాంటి అపార్ట్‌మెంట్‌ల‌నే ఎక్కువ‌గా కొంటుంటారు. వీటికి అధునాత‌న సౌక‌ర్యాలు, సెక్యూరిటీ ఉంటాయి. సామాన్యులు అపార్ట్‌మెంట్ల క‌న్నా ఫ్లాట్‌ల‌నే ఎక్కువ‌గా కొనుగోలు చేస్తుంటారు.

Editor

Recent Posts