వినోదం

Basha Movie : రజినీకాంత్ బాషా చిత్రాన్ని వదులుకున్న టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తెలుసా..?

Basha Movie : ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగినవారిలో రజనీకాంత్ కూడా ఒకరు. దక్షణ భారతదేశంలో ఆయన్ని ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. రజినీకాంత్ డైలాగ్ డెలివరీ, నటనలో ఆయన ప్రత్యేకంగా చూపించే స్టైల్ అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ లు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లు ఉన్నాయి. ఆయన నటించిన చిత్రాల్లో బాషా చిత్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి వేరే చెప్పనవసరం లేదు. బాషా ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు అనే డైలాగ్ అప్పట్లో ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది.

ఒక డాన్ గా ముంబైని గడగడలాడించిన వ్యక్తి ఆటో డ్రైవర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది.. అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిచాంరు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజినీకాంత్ మరియు నగ్మా హీరో హీరోయిన్ లుగా నటించిన బాషా చిత్రాన్ని ముందుగా తమిళంలో చిత్రీకరించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవా ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి. తమిళ్ లో ఈ చిత్రం ఘనవిజయం అందుకోవడంతో తెలుగులో కూడా డబ్ చేయాలని నిర్మాతలు భావించారు.

do you know who is the tollywood actor refused basha movie

సురేష్ కృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసినప్పుడు అప్పట్లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న టాప్ హీరోలు బాలకృష్ణ లేక చిరంజీవితో కానీ రీమేక్ చేయాలనీ అనుకున్నారు. నిర్మాతలు పలువురు స్టార్ ల కోసం ఈ చిత్రాన్ని దేవిశ్రీ థియేటర్ లో స్పెషల్ షో వేశారు. మన హీరోలను ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాలకృష్ణ రీమేక్ సినిమాలు చేయడానికి దూరంగా ఉండేవారు. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోగా చేసే అవకాశం వచ్చిన బాలయ్య రిజెక్ట్ చేశారు. నిర్మాతలు చేసేదేమీ లేక తెలుగులో కూడా రజినీకాంత్ తోనే డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయాన్ని సాధించింది. బాషా చిత్రంతో రజనీకాంత్ కు తెలుగు ప్రేక్షకులలో మరింత ఆదరణ పెరిగింది.

Admin

Recent Posts