వినోదం

Arjun Reddy Movie : అర్జున్ రెడ్డి మూవీని మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా..?

Arjun Reddy Movie : ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మ‌రో హీరో చేసి హిట్ కొట్టిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు హీరోలు కథ నచ్చకనో, ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో మిస్ చేసుకున్న సినిమా క‌థలు మ‌రో హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌డం, సినిమా బాగుండి సూపర్ హిట్ అవ్వడం సాధారణమే. అలాంటిదే విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన అర్జున్ రెడ్డి సినిమా విష‌యంలో జ‌రిగింది. విజయ్ దేవరకొండ నీ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చిన సినిమా అర్జున్ రెడ్డి.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రౌడీ విజయ్ దేవరకొండ యాక్షన్.. యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. డాక్టర్ గా మాత్రమేగాక మాస్ యాంగిల్.. ఓ క్లాస్ కుర్రాడు లో చూపించటం లో… ముఖ్యంగా ఈ తరానికి నచ్చే రీతిలో తెరకెక్కించడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. సింపుల్ కాన్సెప్ట్ కానీ పెళ్లైన త‌ర‌వాత కూడా హీరోయిన్ తిరిగి త‌న ఇంటికి తీసుకెళ్ల‌డ‌మే ఈ సినిమాలో కొత్త‌ద‌నం… అంతే కాకుండా ఈ సినిమాలో వ‌చ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవ‌ల్ ఉంటాయి.

do you know who missed to do arjun reddy movie

దానికి తోడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ల న‌ట‌న కూడా ఎంతో ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంది. ఒక్క సినిమాతోనే ఆమెను ప్రేక్ష‌కులు గుర్తుపెట్టుకునేలా మారిపోయింది. అయితే ముందుగా సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు హీరోగా శ‌ర్వానంద్ ను అనుకున్నాడ‌ట‌. కానీ శ‌ర్వానంద్ సినిమాలో ముద్దులు.. ఎలివేష‌న్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఆఫ‌ర్ వ‌చ్చింది. సందీప్ మొద‌ట హీరోయిన్ గా పార్వ‌తి నెయిర్ ను అనుకున్నాడ‌ట‌. కానీ ఆమె రిజెక్ట్ చేయ‌డంతో షాలినీ పాండేను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇలా అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ, షాలిని పాండే బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Admin

Recent Posts