mythology

ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు నిద్ర పోవడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం రామాయణంలో శ్రీరామచంద్రుడు అతని భార్య సీతమ్మ గురించి ప్రతి విషయం అందరికీ తెలుసు. అయితే లక్ష్మణుడు, లక్ష్మణుడి భార్య ఊర్మిళదేవి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. వివాహమైన తర్వాత పట్టాభిషిక్తుడు కాబోయే రాముడికి జనకమహారాజు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని ఆదేశిస్తాడు. ఈ విధంగా తండ్రి మాటకు ఎంతో గౌరవం ఇచ్చి రాముడు వనవాసానికి బయలుదేరుతున్న సమయంలో శ్రీ రాముడి వెంట తన భార్య సీత బయలుదేరుతుంది. అదేవిధంగా లక్ష్మణుడు వెంట ఊర్మిళాదేవి తను కూడా వనవాసం వస్తానని లక్ష్మణుడితో తెలుపగా అందుకు లక్ష్మణుడు నిరాకరించాడు.

ఈ క్రమంలోనే వనవాసం వెళ్ళిన సీతారామలక్ష్మణులు తన అన్న వదినలకు రక్షణ కల్పించడంలో తను ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని, అందుకోసమే 14 సంవత్సరాల పాటు తనకు నిద్ర రాకుండా విడిచిపెట్టమని నిద్ర దేవతను వేడుకుంటాడు. నిద్ర అనేది ప్రకృతి ధర్మ మని, తనకు రావాల్సిన నిద్రను మరెవరికైనా పంచాలని కోరడంతో లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు తన నిద్రను తన భార్య ఊర్మిళాదేవి కి ప్రసాదించాలని నిద్ర దేవతలు కోరుతాడు.

do you know why urmila devi slept for 14 years

ఈ విధంగా నిద్ర దేవత లక్ష్మణుడి నిద్ర కూడా ఊర్మిళాదేవికి ఇవ్వటం వల్ల వనవాసం చేసిన 14 సంవత్సరాలు ఊర్మిళాదేవి కేవలం తన గదికి మాత్రమే పరిమితమై నిద్రపోతుంది. ఈ విధంగా సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తే, వారికి ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా 14 సంవత్సరాలపాటు ఊర్మిళాదేవి నిద్ర పోతూ వారికి రక్షణగా నిలిచిందని చెప్పవచ్చు.

Admin

Recent Posts