తమిళ్ డబ్బింగ్ రాజా రాణి మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నజ్రియా నజీమ్. మొదటి మూవీతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మలయాళంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ మొదటిగా మలయాళం టీవీ చానెల్ ఏషియా నెట్ లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు.
2006లో పలుంకు అనే మలయాళ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైన నజ్రియా ఆ తర్వాత కాలంలో 2013లో మాడ్ డాడ్ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకి ఎంట్రీ ఇచ్చింది. నేరం, రాజారాణి , ఓం శాంతి ఓషానా , బెంగళూర్ డేస్ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ప్రముఖ కన్నడ హీరో ఫాహద్ ఫాజిల్ ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు స్టార్ కంపుల్స్ ఇటీవల తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఫాహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓ రేంజ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఫాహద్ పుష్ప చిత్రంలో షెకవత్ అనే పోలీసు అధికారి పాత్రలో హీరోకి ధీటుగా కనిపించాడు. ప్రస్తుతం ఫాహద్ పుష్ప-2 సినిమాలో నటించారు. ఇక నజ్రియా అంటే సుందరానికి మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వీరిద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నారు. నజ్రియా కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సైతం నజ్రియా నజీమ్ చిన్ననాటి ఫోటోలో చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.