technology

మీ ఫోన్ పోయిందా ? అయితే అందులో ఉండే పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే అకౌంట్ల‌ను ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి..!

ఫోన్లు పోవ‌డం అనేది స‌హ‌జంగానే జ‌రుగుతుంటుంది. మ‌న అజాగ్ర‌త్త వ‌ల్ల లేదంటే మ‌నం ఏమ‌రుపాటుగా ఉన్న‌ప్పుడు దొంగ‌లు కొట్టేయ‌డం వ‌ల్ల‌.. ఫోన్లు పోతుంటాయి. ఈ క్ర‌మంలో అందులో ఉండే డేటా గురించే మ‌న‌కు బెంగ ప‌ట్టుకుంటుంది. ముఖ్యంగా యూపీఐ యాప్‌ల గురించి భ‌యం చెందుతారు. వాటిని ఓపెన్ చేసి అకౌంట్ల ద్వారా డ‌బ్బుల‌ను దొంగిలిస్తే ఎలా ? అని దిగులు ప‌డ‌తారు. అయితే కింద తెలిపిన స్టెప్స్ ను పాటిస్తే మీ ఫోన్‌లో ఉండే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్ల‌ను సుల‌భంగా బ్లాక్ చేయ‌వ‌చ్చు. మ‌రి ఆ స్టెప్స్ ఏమిటంటే..

గూగుల్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయాలంటే..

స్టెప్ 1: ఫోన్ పోయిన వెంట‌నే వేరే నంబ‌ర్ నుంచి 18004190157 అనే హెల్ప్ లైన్ నంబ‌ర్‌కు కాల్ చేయాలి.

స్టెప్ 2: క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. గూగుల్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయ‌మ‌ని చెప్పాలి.

స్టెప్ 3: ఆండ్రాయిడ్ యూజ‌ర్లు అయితే ఫైండ్ మై ఫోన్ ద్వారా గూగుల్ అకౌంట్‌లోని డేటాను రిమోట్ వైప్ చేయ‌వ‌చ్చు. దీంతో ఫోన్‌లోని డేటా డిలీట్ అవుతుంది. ఇలా గూగుల్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయ‌వ‌చ్చు.

if you lost your phone then know how to block upi apps

పేటీఎం అకౌంట్‌ను బ్లాక్ చేయాలంటే ?

స్టెప్ 1: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్ లైన్ నంబ‌ర్ 01204456456 కు కాల్ చేయాలి.

స్టెప్ 2 : లాస్ట్ ఫోన్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 3: ఆల్ట‌ర్‌నేటివ్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. పోయిన ఫోన్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి.

స్టెప్ 4: పేటీఎం వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అందులో ఉండే 24×7 help ను ఎంచుకోవాలి. అక్క‌డ ఉండే రిపోర్ట్ ఫ్రాడ్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 5: మెసేజ్ అస్ అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేయ‌గానే ఓన‌ర్‌షిప్ ప్రూఫ్ అడుగుతుంది. అక్క‌డ పేటీఎం లావాదేవీల‌ను చూపే స్టేట్ మెంట్ ను ఇవ్వాలి. పోయిన ఫోన్ గురించి పోలీసుల‌కు ఇచ్చిన కంప్లెయింట్‌ను చూపాలి. లేదా సంబంధిత ప‌త్రాల‌ను చూపాలి.

స్టెప్ 6: వెరిఫికేష‌న్ అనంత‌రం మీ పేటీఎం అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు.

ఫోన్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయాలంటే ?

స్టెప్ 1: ఫోన్‌పే వినియోగ‌దారులు 08068727374 అనే హెల్ప్ లైన్ నంబ‌ర్‌కు కాల్ చేయాలి.

స్టెప్ 2: మీ ఫోన్‌పే అకౌంట్‌లో ఏదైనా స‌మ‌స్య ఉంటే రిపోర్టు చేయ‌మ‌ని అడుగుతారు. అక్క‌డ స‌రైన ఆప్ష‌న్ నంబ‌ర్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 3: రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌ను, ఓటీపీని వెరిఫికేష‌న్ కోసం ఎంట‌ర్ చేయాలి.

స్టెప్ 4: ఓటీపీ పొందే స‌దుపాయం లేద‌ని ఆప్ష‌న్‌ను ఎంచుకోవచ్చు. అక్క‌డ సిమ్ కార్డు పోయింద‌ని ఆప్ష‌న్ ను ఎంచుకోవ‌చ్చు.

స్టెప్ 5: ఈ విధానాన్ని అనుస‌రించాక బ్లాక్ ది అకౌంట్ అనే రిక్వెస్ట్‌ను ప్రారంభిస్తారు. దీంతో అకౌంట్ బ్లాక్ అవుతుంది.

Admin

Recent Posts