Dondakaya Masala Fry : దొండ‌కాయ మ‌సాలా ఫ్రై ఇలా చేయండి.. రైస్‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Dondakaya Masala Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు ఒక‌టి. దొండ‌కాయ‌లు కూడా ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో దొండ‌కాయ ఫ్రై ఒక‌టి. చాలా మంది దొండ‌కాయ ఫ్రై ను ఇష్టంగా తింటారు. ఈ దొండ‌కాయ ఫ్రైను అంద‌రూ ఇష్ట‌ప‌డేలా మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డొండ‌కాయ మ‌సాలా ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పొడుగ్గా త‌రిగిన దొండ‌కాయ‌లు – అర కిలో, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బ‌రి పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Dondakaya Masala Fry recipe in telugu make in this method
Dondakaya Masala Fry

దొండ‌కాయ మ‌సాలా ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దొండ‌కాయ ముక్క‌లు వేసి చ‌క్క‌గా వేయించాలి. దొండ‌కాయ ముక్క‌లను మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత వేయించిన దొండ‌కాయ ముక్క‌ల‌ను వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి, ఎండు కొబ్బ‌రి పొడి వేసి మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ మ‌సాలా ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ ఫ్రైను ఎంతో ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే దొండ‌కాయ ఫ్రై కంటే ఈ విధంగా త‌యారు చేసిన దొండ‌కాయ ఫ్రై మ‌రింత రుచిగా ఉంటుంది.

D

Recent Posts