Donne Biryani : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఫేమ‌స్ దొన్నె బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Donne Biryani : దొన్నె చికెన్ బిర్యానీ.. మ‌న‌లో చాలా మంది ఈ పేరును వినే ఉంటారు. క‌ర్ణాట‌క స్పెష‌ల్ అయిన దొన్నె చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దొన్నె అనే ఆకుల్లో ఈ బిర్యానీని స‌ర్వ్ చేస్తూ ఉంటారు. త‌ర‌చూ తినే బిర్యానీ కంటే ఈ బిర్యానీ రుచి వేరేగా ఉంటుంది. ఈ దొన్నె బిర్యానీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడాచాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ దొన్నె బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దొన్నె బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – అర క‌ప్పు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, అనాస పువ్వు – 1, మ‌రాఠీ మొగ్గ‌లు – 2, జాప‌త్రి – కొద్దిగా, బిర్యానీ ఆకులు – 2, జీడిప‌ప్పు – కొద్దిగా, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, తరిగిన ట‌మాట – 1, ఉప్పు – త‌గినంత‌, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, నెయ్యి – 2 టీ స్పూన్స్, నాన‌బెట్టిన చిట్టి ముత్యాల బియ్యం – 3 గ్లాసులు.

Donne Biryani recipe in telugu make it in restaurant style
Donne Biryani

చికెన్ మ్యారినేష‌న్ కు కావల్సిన ప‌దార్థాలు..

చికెన్ – ముప్పావు కిలో, ఉప్పు -త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పెరుగు – ఒక టేబుల్ స్పూన్.

మ‌సాలా పేస్ట్ లు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె -ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ -1, అల్లం – 2ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10 నుండి 15, కొత్తిమీర – గుప్పెడు, పుదీనా – గుప్పెడు, మెంతికూర – గుప్పెడు, ప‌చ్చిమిర్చి – కారానికి త‌గిన‌న్ని.

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – రెండు టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, సోంపు గింజ‌లు -అర టీ స్పూన్, సాజీరా – అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, బిర్యానీఆకు – 1, మ‌రాఠీ మొగ్గ‌లు – 2, జాజికాయ – కొద్దిగా, దాల్చిన చెక్క- ఒక ముక్క‌, ల‌వంగాలు – 4, న‌ల్ల యాల‌క్కాయ – 1, యాల‌కులు -3, అనాస పువ్వు – 1, స్టోన్ ప్ల‌వ‌ర్ – కొద్దిగా, జాప‌త్రి – కొద్దిగా.

దొన్నె బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకుని అందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన మిగిలిన ప‌దార్థాలు వేసి క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి వేయించాలి. వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మ‌రో రెండు నిమిషాల పాటు వేయించాలి. వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో కొత్తిమీర‌, పుదీనా, మెంతికూర‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి.

వీటిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి. తరువాత జార్ లో వేయించిన ఉల్లిపాయ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో వేయించిన కొత్తిమీర‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బడే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చికెన్ ను వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మెంతికూర‌, ప‌చ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత నాలుగున్న‌ర గ్లాసుల నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, నెయ్యి, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. బియ్యం ఉడుకుప‌ట్టిన త‌రువాత మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత స్ట‌వ్ మీద పాత పెనాని ఉంచి దానిపై బిర్యానీ గిన్నెను ఉంచి 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మ‌రో 15 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మ‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొన్నె బిర్యానీ త‌యార‌వుతుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా వెరైటీగా దొన్నె బిర్యానీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts