ఆధ్యాత్మికం

పూజ చేసేటప్పుడు ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తున్నాయా..? అయితే ఏం జ‌రుగుతుంది..?

భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తే కచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భగవంతుడి ఆశీస్సులు కలిగి అంతా మంచే జరుగుతుంది. పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి. పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొంతమంది భగవంతుడిని పూజించేటప్పుడు కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచన లాంటివి వస్తూ ఉంటాయి. అయితే అలా జరగడం మంచిదా..? లేదంటే దాని వల్ల ఏమైనా చెడు జరుగుతుందా అనేది చూస్తే.. నిజానికి మనం పూజ ఎందుకు చేస్తామంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం. అలాంటి పూజని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. అలా చేయాలంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి.

dos and donts while performing pooja

ఒక్కొక్కసారి మనకి తెలియకుండా మన‌ మనసు వేరే ఆలోచనల వైపు వెళ్తుంది. అలానే పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం, తుమ్ములు, నిద్ర రావడం వంటివి కూడా జరుగుతుంటాయి. అయితే మొదటి కారణం శరీరానికి సరైన విశ్రాంతి లేకపోవడం వలన ఇలా జరగొచ్చు. కొన్నిసార్లు త్వరగా నిద్ర లేచి పూజ చేసుకోవడం వలన కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. తల భారంగా అనిపించడం, కళ్ళు బరివెక్కినట్లు ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.

మన చుట్టూ ఉండే నెగెటివ్ వైబ్రేషన్స్ కూడా కారణం అవ్వచ్చు. ఇలాంటి సమయంలో పూజ త్వరగా ముగించుకుని వచ్చేయండి. లేదంటే ఒకసారి లేచి కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని కొనసాగించొచ్చు. మన మనసు పూజ మీద నిలపలేకపోవడానికి కారణం నెగెటివ్ ఎనర్జీ కూడా అవ్వచ్చు. సాంబ్రాణి, ధూపం వేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంటిని తుడిచే నీళ్లల్లో పసుపు, రాళ్ల ఉప్పు వేస్తే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కర్పూరాన్ని, లవంగాలని కలిసి కాల్చితే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇలా చేయడం వలన నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మనసు పూజ మీద పెట్టడానికి అవుతుంది.

Admin

Recent Posts