information

డెబిట్‌, క్రెడిట్ కార్డుల పిన్‌ల‌ను సుల‌భంగా గుర్తు పెట్టుకునే మెథ‌డ్‌.. త‌ప్ప‌క తెలుసుకోండి..!!

సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి ఒక‌టి క‌న్నా ఎక్కువ బ్యాంకు అకౌంట్లు, ఒక‌టి క‌న్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటాయి. దీంతో అన్ని కార్డుల‌కు చెందిన పిన్ నంబ‌ర్ల‌ను గుర్తుంచుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. అయితే కింద కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతోంది. వాటిని ఉప‌యోగించి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌కు పిన్‌ల‌ను సుల‌భంగా సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో వాటిని మర్చిపోతాం అన్న బెంగ ఉండ‌దు. కార్డును చూస్తే నంబ‌ర్ మీకు ఆటోమేటిగ్గా గుర్తుకు వ‌స్తుంది. మ‌రి ఆ ఉదాహ‌ర‌ణ‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

easy way to remember debit or credit card pins

1. పైన ఇచ్చిన కార్డును చూశారు కదా. అందులోనే కాదు, ఇత‌ర ఏ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై అయినా కూడా 16 అంకెలు ఉంటాయి. 4 అంకెలు క‌లిసి ఒక గ్రూప్‌గా ఉంటాయి. అయితే మీరు ఒక్కో గ్రూప్‌లో ఉన్న రెండో అంకెను లేదా మూడో అంకెను తీసుకోండి. ఉదాహ‌ర‌ణ‌కు.. ఒక్కో గ్రూప్‌లో రెండో అంకెను తీసుకుంటే.. పైన ఇచ్చిన కార్డు ప్ర‌కారం.. 0, 7, 3, 2 అవుతాయి. అదే ఒక్కో గ్రూప్‌లో మూడో అంకెను తీసుకుంటే.. 1, 3, 9, 0 అవుతాయి. అంటే మీ కార్డుకు అవ‌స‌రం అయ్యే నాలుగు అంకెల పిన్ వ‌చ్చేసిన‌ట్లే. దీని ప్ర‌కారం 0732 లేదా 1390 ల‌ను పిన్‌లుగా పెట్టుకోవ‌చ్చు.

2. ఇక పైన ఇచ్చిన అంకెల్లాగే నాలుగు అంకెల‌ను తీసుకుని వాటిని రివ‌ర్స్ చేయండి. అంటే.. 2370 లేదా 0931 అవుతాయి. ఈ విధంగా కూడా పిన్‌ను సెట్ చేయ‌వ‌చ్చు.

3. ఇక ఇంకో ఉదాహ‌ర‌ణ‌కు వ‌స్తే.. ఒక గ్రూప్‌లో రెండు అంకెలు, ఇంకో గ్రూప్‌లో రెండు అంకెలు ఏవైనా తీసుకుని నాలుగు అంకెల పిన్‌ను సెట్ చేయ‌వ‌చ్చు. అంటే.. పైన చిత్రాన్ని ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే.. రెండో గ్రూప్‌లో ఉన్న 39ను, నాలుగో గ్రూప్‌లో ఉన్న 03ల‌ను తీసుకోండి. అప్పుడు 3903 అవుతుంది. ఈ విధంగా కూడా పిన్‌ను సెట్ చేసుకోవ‌చ్చు.

ఇలా డెబిట్‌, క్రెడిట్ కార్డుల పిన్‌ల‌ను సెట్ చేయ‌వ‌చ్చు. అయితే ఈ విధంగా ఉదాహ‌ర‌ణ‌ల‌ను పాటిస్తూ పిన్ నంబ‌ర్ల‌ను సెట్ చేసుకుంటే.. త‌రువాత కార్డు పోతే ఎలా ? అప్పుడు కార్డు దొరికిన వారు ఇవే ఉదాహ‌ర‌ణ‌ల‌తో పిన్‌ను సుల‌భంగా తెలుసుకుంటారు క‌దా.. అంటే.. అవును.. తెలుసుకుంటారు. కానీ పైన ఇచ్చిన‌వి శాంపిల్స్ మాత్ర‌మే. అంటే.. ఒక ఐడియానే. నిజానికి మీకు న‌చ్చిన సీక్వెన్స్‌లో ఆ నంబ‌ర్‌ల‌ను తీసుకుని పిన్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. పైన ఇచ్చిన ఉదాహ‌ర‌ణ‌ల్లాగే పిన్‌ల‌ను పెట్టుకోవాల‌ని ఏమీ లేదు. ఆ విధంగా సీక్వెన్స్ ల‌లోనూ పిన్‌ల‌ను సెట్ చేసుకోవ‌చ్చు.. అని ఒక ఐడియా ఇచ్చాం.. అంతే.. అందులో ఉండే 16 అంకెల‌ను మీకు న‌చ్చిన విధంగా సీక్వెన్స్‌లో తీసుకుని పిన్‌ను సెట్ చేయ‌వ‌చ్చు. అది ఇత‌రుల‌కు తెలిసే అవ‌కాశం అస్స‌లే ఉండ‌దు. ఎవ‌రి సీక్వెన్స్ వారికే ఉంటుంది. దాన్ని ఇత‌రులు డీకోడ్ చేయ‌లేరు. పిన్‌ను తెలుసుకోలేరు. సీక్వెన్స్‌ల‌ను పెట్టుకునేందుకే పైన శాంపిల్స్ ను ఇవ్వ‌డం జ‌రిగింది.

Admin

Recent Posts