ఆధ్యాత్మికం

పెళ్లి కాని వారు ఈ ఆలయంలో బండరాయి ఎత్తితే చాలు..!

సాధారణంగా చాలా మంది యువతీ యువకులకు పెళ్లి వయసు వచ్చినప్పటికీ ఎలాంటి పెళ్లి సంబంధాలు కుదరవు. అందుకు గల కారణం వారి జాతకంలో దోషాలు ఉండటమేనని పురోహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యువతీ యువకులు ఎన్నో ఆలయాలను దర్శించి గ్రహ దోష నివారణలు చేస్తుంటారు. అయితే పెళ్లి కాకుండా, పెళ్లి జరిగి సంతానం లేకుండా బాధ పడేవారు పెండ్లి గంగమ్మ ఆలయాన్ని దర్శిస్తే వారికి వివాహం జరుగుతుందని, సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. మరి ఈ పెండ్లి గంగమ్మ ఆలయం ఎక్కడ ఉంది ? ఈ ఆలయ విశిష్టత ఏమిటి అంటే..

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ పెండ్లి కనుమ అనే గ్రామంలో 300 ఏళ్లనాటి గంగమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రెండు బండ రాళ్ళు ఉంటాయి. ఈ బండరాళ్లు సుమారు 100 కేజీల పైగా ఉంటాయి. ఇందులో ఒకటి పెట్టరాయి కాగా, మరొకటి పుంజు రాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ ఆలయంలో ఉన్న బండరాళ్లను ఎత్తి కింద పడేస్తే చాలు వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

unmarried persons will get married if they lift stone here

ఈ విధంగా ఈ ఆలయానికి ఎక్కువగా పెళ్లి కాని వారు, సంతానంలేని వారు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఈ బండరాళ్లను ఎత్తి కింద పడేస్తారు. రాయి మొత్తం పైకి ఎత్తాలి అనే నియమం లేకున్నప్పటికీ మనస్ఫూర్తిగా కొంతవరకైనా ఎత్తి కింద పడేయాలని ఇక్కడ భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

Admin

Recent Posts