Egg Ghee Roast : కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి ఒక్క‌సారి ఇలా కూర చేయండి.. రుచి చూస్తే జ‌న్మ‌లో విడిచిపెట్ట‌రు..!

Egg Ghee Roast : కోడిగుడ్లు అంటే అంద‌రూ ఇష్టంగానే తింటారు. ఆ మాట‌కొస్తే నాన్‌వెజ్ ప్రియుల్లో చాలా మంది కోడిగుడ్ల‌ను ఇష్టంగా లాగించేస్తారు. కొంద‌రు వెజిటేరియ‌న్లు కూడా కేవ‌లం ఎగ్స్‌ను మాత్ర‌మే తింటారు. అంత‌లా గుడ్లు ప్రాచుర్యం పొందాయి. అయితే కోడిగుడ్ల‌తో స‌హ‌జంగానే చాలా మంది అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. కోడిగుడ్ల ఫ్రై, ఇగురు, పులుసు, ట‌మాటా క‌ర్రీ.. ఇలా చేస్తుంటారు. కానీ కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి చేసే ఈ కూర గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. దీన్ని ఒక్క‌సారి ట్రై చేయండి. దీని రుచి చూస్తే అస‌లు మీరు దీన్ని జ‌న్మ‌లో విడిచిపెట్ట‌రు. ఈ క్ర‌మంలోనే కోడిగుడ్ల‌తో ఎగ్ ఘీ రోస్ట్‌ను ఎలా త‌యారు చేయాలో దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ ఘీ రోస్ట్ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన గుడ్లు – 7, ధ‌నియాలు – 1 టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర – 1 టేబుల్ స్పూన్‌, సోంపు – 1 టేబుల్ స్పూన్‌, మిరియాలు – అర టీస్పూన్‌, ల‌వంగాలు – 6, దాల్చిన చెక్క – 1 ముక్క‌, ఎండు మిర్చి – 12, నెయ్యి – పావు క‌ప్పు, ఉల్లిపాయ‌లు – 2, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్ స్పూన్‌, క‌రివేపాకు రెబ్బ‌లు – 2, ట‌మాటాలు – 2, ప‌సుపు – అర టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌.

Egg Ghee Roast recipe make like this for very good taste
Egg Ghee Roast

ఎగ్ ఘీ రోస్ట్‌ను త‌యారు చేసే విధానం..

స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, సోంపు, మిరియాలు, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, ఎండు మిర్చి వేయించుకుని ఆ త‌రువాత మెత్త‌గా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం వెల్లుల్లి ముద్ద, క‌రివేపాకు వేసి వేయించుకుని పొడి చేసిన మ‌సాలాతోపాటు మిగిలిన ప‌దార్థాల‌ను వేసి బాగా క‌లిపి పావు క‌ప్పు నీళ్లు పోయాలి. ఈ కూర ద‌గ్గ‌ర‌కు అయ్యాక ఉడికించిన గుడ్లు వేసి బాగా క‌లిపి దింపేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన ఎగ్ ఘీ రోస్ట్ రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులో తిన్నా సరే రుచిగా ఉంటుంది. అంద‌రూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts