Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బ‌చ‌త్ ధ‌మాల్ సేల్‌.. స్మార్ట్‌ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Flipkart : ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్లను ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఎప్పుడూ ప్ర‌త్యేక సేల్స్ నిర్వ‌హిస్తూ భారీ డిస్కౌంట్లను అనేక ర‌కాల ఉత్ప‌త్తుల‌పై అందిస్తున్నాయి. ఇక తాజాగా ఫ్లిప్‌కార్ట్ మ‌రో సేల్‌ను ప్రారంభించ‌నుంది. మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్ 6వ తేదీ వ‌రకు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు ఉత్ప‌త్తుల‌పై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు.

Flipkart big bachat dhamaal sale huge discounts on smart phones
Flipkart

ఫ్లిప్ కార్ట్ సంస్థ బిగ్ బ‌చ‌త్ ధమాల్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను మార్చి 4న ప్రారంభించ‌నుంది. ఇందులో యూపీఐ ద్వారా చేసే చెల్లింపుల‌పై రూ.1000 వ‌ర‌కు త‌గ్గింపును ఇవ్వ‌నున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్లు, వియ‌ర‌బుల్స్‌, టీవీ మోడ‌ల్స్‌, ఫ్యాష‌న్‌, గృహోప‌క‌ర‌ణాల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నున్నారు.

ఇక ఈ సేల్‌లో మోటోరోలా ఎడ్జ్ 30 ప్రొ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు. క‌స్ట‌మ‌ర్లు ఐఫోన్ 12 మోడ‌ల్ ఫోన్ల‌పై ప్ర‌త్యేక డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. ప‌లు బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాల‌ను అందిస్తున్నాయి. ఇక ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా వ‌స్తువుల‌ను కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది.

Editor

Recent Posts