Rats : ఇంట్లో ఎలుక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే వాటిని తరిమేయ‌వ‌చ్చు..!

Rats : ఏదో ఒక సంద‌ర్భంలో మ‌న‌లో చాలా మంది ఇంట్లో ఎలుకల స‌మ‌స్య‌ను ఎదుర్కొనే ఉంటారు. ఇంట్లో ఎలుక‌లు ఉంటే క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇంట్లో బ‌ట్ట‌ల‌ను కొరుకుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. ఆహారం వండిన గిన్నెల‌పై కూడా తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎలుక‌లు ఉండ‌డం అంత మంచిది కాదు. వీటి వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఇంట్లోకి ప్ర‌వేశించిన ఎలుక‌ల‌ను ప‌ట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఇవి ఎప్పుడూ ఎవ‌ర‌కి క‌నిపించ‌కుండా మూల‌ల‌కు న‌క్కి ఉంటాయి. వీటి నుండి బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో ల‌భించే ఎలుక‌ల మందులో అవి తినే ఆహారాలను క‌లిపి పెడుతూ ఉంటారు.

అలాగే ఎలుకల‌ను పట్టుకోవ‌డానికి గ్లూ ప్యాడ్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా పెంపుడు జంతువులు, చిన్న పిల్ల‌లు ఉన్న ఇంట్లో వీటిని ఉప‌యోగించ‌డం అంత మంచిది కాదు. వీటికి బ‌దులుగా స‌హ‌జ చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా మ‌నం చాలా సుల‌భంగా ఎలుకల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు. ఇంట్లో ప్ర‌వేశించిన ఎలుకల‌ను త‌రిమి కొట్టే స‌హ‌జ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలుక‌ల‌కు ల‌వంగాల వాస‌న న‌చ్చ‌దు. క‌నుక కొన్ని ల‌వంగాల‌ను వ‌స్త్రంలో వేసి మూట‌లా క‌ట్టి ఎలుక‌లు తిరిగే చోట ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ వాస‌న‌కు ఎలుకలు రాకుండా ఉంటాయి. అలాగే ఎలుకలు తిరిగే చోట పెప్ప‌ర్ మెంట్ ఆయిల్ ను స్ప్రే చేయాలి.

follow these tips to get rid of the rats
Rats

అలాగే దూది ఉండ‌ల‌ను పెప్ప‌ర్ మెంట్ ఆయిల్ లో ముంచి ఎలుక‌లు ఎక్కువ‌గా తిరిగే చోట ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా ఎలుక‌ల బెడ‌ద త‌గ్గుతుంది. అదే విధంగా ఎలుక‌లు తిరిగే చోట కారాన్ని చ‌ల్లాలి. అలాగే వ‌స్త్రంలో కారాన్ని వేసి మూట‌లా క‌ట్టి ఎలుక‌లు తిరిగే చోట ఉంచాలి. కారం ఘాటుకు ఎలుకలు ద‌గ్గ‌రికి రాకుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయ‌లను ముక్క‌లుగా చేసి గ‌దిలో మూల‌ల‌కు ఉంచాలి. ఉల్లిపాయ వాస‌న‌కు ఎలుకలు దూరంగా పారిపోతాయి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల ఎలుక‌ల స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఇంట్లో ఎలుకలు ఉన్న వారు ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

D

Recent Posts