Home Tips

Mehindi Removing Tips : చేతులపై మెహిందీ త్వరగా తొలగిపోవాలంటే.. ఈ చిన్న చిట్కాని ఫాలో అవ్వండి..!

Mehindi Removing Tips : చాలామంది ఆడవాళ్ళకి, మెహిందీ అంటే ఎంతో ఇష్టం. ఏదైనా ఫంక్షన్ అయినా, పండగ అయినా కచ్చితంగా మెహిందీ పెట్టుకుంటున్నారు. అయితే. ఈ మెహిందీ పెట్టుకున్నప్పుడు బాగుంటుంది. ఎర్రగా పండుతుంది. కానీ, రోజు రోజుకి వెలిసిపోతూ ఉంటుంది. మరకలా చేతిలో ఉంటుంది. చూడడానికి చాలా మందికి నచ్చదు. చాలామంది ఆడవాళ్ళకి మెహిందీ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా ఫంక్షన్ అయినా పండగ అయినా కచ్చితంగా మెహిందీ పెట్టుకుంటున్నారు.

ఒకసారి మెహిందీ పెట్టుకున్నాక, అది పోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మరకలు పోవాలంటే ఏం చేయాలి అని, చాలామంది రకరకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. అయితే, మెహిందీ త్వరగా పోవాలంటే, ఇలా చేయడం మంచిది. టూత్ పేస్ట్ లో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. టూత్ పేస్ట్ ని వాడటం వలన, మరకలు ఈజీగా పోతాయి. పేస్ట్ లో మెహిందీ రంగుని తొలగించే గుణాలు ఉంటాయి.

follow these tips to remove mehindi from hands

సో, మీరు కనుక మెహిందీ ని పోగొట్టుకోవాలని అనుకుంటే, ఈ పేస్ట్ ని తీసుకుని, మెహిందీ పై పొరలాగ అప్లై చేయాలి. ఆరిపోయిన తర్వాత, నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే, ఈజీగా మరకలు పోతాయి. కాబట్టి, పేస్ట్ ని మీరు మరకలని పోగొట్టుకోవడానికి వాడొచ్చు. ఉప్పు కూడా మంచి క్లెన్సింగ్ ఏజెంట్. ఉప్పుని వాడితే కూడా మెహిందీ మరకలు పోతాయి. ఒక బౌల్ తీసుకొని, అందులో నీళ్లు వేసి, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి.

ఆ నీటిలో చేతులు మునిగేటట్టు ఉంచాలి. 20 నిమిషాల తర్వాత, బయటకు తీసేయండి. మెహిందీ మొత్తం పోతుంది. కాళ్ళకి మెహిందీ పోవాలంటే, టబ్‌లో వాటర్ పెట్టుకుని, ఇలాగే సాల్ట్ వేసుకుని కాళ్ళని టబ్‌లో పెట్టండి. మెహిందీ మరకల్ని పోగొట్టుకోవాలని అనుకునే వాళ్ళు, ఈ చిన్న చిన్న చిట్కాలు ద్వారా మెహిందీ మరకల్ని పోగొట్టుకోవచ్చు. ఈజీ కూడా. పైగా మనకి ఇవి ఇంట్లో దొరికే వస్తువులే. ఎక్కువగా కష్టపడక్కర్లేదు. పైగా చిటికెలోనే మనం మెహిందీ మరకల్ని పోగొట్టుకోవచ్చు.

Admin

Recent Posts