ఆధ్యాత్మికం

Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే రోజూ ఇలా చేయండి.. ఇక తిరుగే ఉండదు..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అయిపోవాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చూస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే కొన్ని పద్ధతుల్ని క‌చ్చితంగా పాటించాలి. ఒక వ్యక్తి ఇంట్లో ప్రతికూల శక్తి కనుక చేరిందంటే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్లి పోతుంద‌ని గుర్తు పెట్టుకోండి. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే మాత్రం ఇలాంటి తప్పులను చేయకూడదు.

రోజూ సాయంత్రం పూట ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రెండు లవంగాలని అందులో వేయండి. మీ ఇంటి ముఖద్వారానికి రెండు వైపులా కూడా ఈ దీపాలని పెట్టండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కర్పూరం కూడా మీ ఇంటికి మంచి చేయడానికి సహాయపడుతుంది. కర్పూరంతో వాస్తు దోషాలని తొలగించుకోవచ్చు. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కర్పూరాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలని కనుక మీరు వేసినట్లయితే ప్రతికూల శక్తి తొలగి పోతుంది. అంతా మంచే జరుగుతుంది. సమస్యలు ఏమీ కూడా ఉండవు.

follow this rule to get lakshmi devi blessings

కర్పూరం వలన మంచి వాసనే కాదు. కర్పూరాన్ని వెలిగించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఆవుకి ఆహారాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. ఎంతో పుణ్యం వస్తుంది. గోమాతలో ఉన్న అన్ని దేవుళ్ళు సంతృప్తి చెంది మిమ్మల్ని చక్కగా చూస్తారు. గోమాతకి రోజూ ఏదైనా ఆహారం పెట్టండి. ఇలా చాలా సమస్యలు తొలగి పోతాయి.

పక్షులకి ఆహారం పెడితే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. జీవితంలో మంచి పురోగతి, శ్రేయస్సు ఉంటుంది. ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు తుడవకూడదు. అలా చేయడం వలన సంపద పోతుంది. లక్ష్మీదేవి కోప్పడుతుంది. కనుక ఈ తప్పులు చేయకండి. అలాగే లక్ష్మీ దేవి ఇంట్లో ఉండాలంటే పైన చెప్పిన పద్ధతుల్ని పాటించండి.

Admin

Recent Posts