చిట్కాలు

Gas Trouble : గ్యాస్ స‌మ‌స్య బాగా ఉందా.. 2 వారాలు దీన్ని తాగితే.. గ్యాస్ అన్న‌ది ఉండ‌దు..!

Gas Trouble : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనుషులను ఎక్కువగా బాధిస్తున్న వాటిలో గ్యాస్ సమస్య కూడా ఒకటి. చాలామంది నిత్యం ఈ గ్యాస్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్‌ అనేది కొందరిలో సర్వ సాధారణంగా వస్తుంది. నేటి జీవన శైలి కారణంగా చాలామందిలో ఈ సమస్య రోజు రోజుకీ పెరుగుతోంది. మరి ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే మనకు ప్రకృతి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలను ప్రసాదించింది. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో అలొవెరా కూడా ఒకటి.

ఇప్పుడు అలొవెరా వల్ల మనం గ్యాస్ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చు అనేది తెలుసుకుందాం. అలొవెరా మొక్క ఔషధ గుణాలకు బాగా ప్రసిద్ధి చెందింది. కలబందలో ఉండే శీతలీకరణ గుణాలు చర్మ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, కీళ్ల నొప్పులు వంటి అనేక అనారోగ్య సమస్యలతోపాటు గ్యాస్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందడంలో సహాయపడతుంది. అలొవెరాలో ఉండే ఔషధ గుణాలు పొట్టలో అల్సర్, పేగు పూత, కడుపులో మంట, గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ను తగ్గించడంలో సహాయపడుతాయి.

Gas Trouble if you have it then take this for 2 weeks Gas Trouble if you have it then take this for 2 weeks

ఈ విషయం సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయ్యింది. ఒక 79 మందిని గ్రూప్ గా డివైడ్ చేసి వారికి అలొవెరా జ్యూస్ ను ఉదయం 10ml సాయంత్రం 10ml ఇచ్చారు. అంతేకాకుండా 2 స్పూన్స్ అలొవెరా జెల్ కి ఒక స్పూన్ తేనె, హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ మూడింటినీ 100ml వాటర్ లో బాగా కలిపి తాగించారు. ఇంకొక 79 మందికి ఓమెప్రొజోల్ టాబ్లెట్ ఇచ్చారు. వీరిలో అలొవెరా జ్యూస్ తాగిన వారికి రెండు వారాల్లో ఫలితం బాగా కనిపించింది. అలొవెరా జ్యూస్ తీసుకున్న వారిలో 70 శాతం వరకు గ్యాస్ సమస్య తగ్గిపోయింది.

అలొవెరాలో ముఖ్యంగా యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి పొట్ట అంచుల వెంబడి గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా రక్షిస్తుంది. అలొవెరా జ్యూస్ ను నిత్యం తీసుకోవడం వలన పొట్టలో హెల్తీ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే ప్లాంట్ కాంపౌండ్స్ వలన ప్రేగులలో నీటి శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకాన్ని నివారించి సుఖ విరేచనం అవ్వడానికి సహకరిస్తుంది. ఎప్పుడైతే సుఖ విరోచనం అవుతుందో అప్పుడు గ్యాస్ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

Admin

Recent Posts