lifestyle

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

Ghost : దెయ్యం.. ఈ పేరు చెప్ప‌గానే స‌హ‌జంగానే చాలా మందికి వెన్నులో వ‌ణుకు పుడుతుంది. అస‌లు ఆ మాట వింటేనే చాలా మంది తీవ్రంగా భ‌య‌ప‌డిపోతారు. ఒకసారి దెయ్యం అనే మాట‌ను విన్నా.. లేక ఆ మాట‌ను త‌ల‌చుకున్నా.. ఇక చాలా మందికి రాత్రి నిద్ర ప‌ట్ట‌దు. అయితే కొంద‌రు ఎల్ల‌ప్పుడూ త‌మ చుట్టు ప‌క్క‌ల దెయ్యాలు ఉన్నాయేమోన‌ని అనుకుంటారు. అయితే వాస్త‌వానికి దెయ్యాలు మ‌న స‌మీపంలో ఉంటే ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దెయ్యాలు మ‌నకు స‌మీపంలో ఉంటే మ‌న‌కు అదో ర‌క‌మైన వాస‌న వ‌స్తుంది. అలాంటి వాస‌న‌ను మ‌నం అంత‌కు ముందు చూసి ఉండం. అలాంటి భిన్న‌మైన వాస‌న వ‌స్తే.. మ‌న ద‌గ్గ‌ర దెయ్యం ఉన్న‌ట్లే భావించాలి. ఇక దెయ్యం ఉంటే ఇంట్లో ఎల్ల‌ప్పుడూ విద్యుత్‌కు ఆటంకాలు ఏర్ప‌డుతుంటాయి. క‌రెంటు పోవ‌డం, రావ‌డం.. లేదంటే మిణుకు మిణుకుమ‌న‌డం జ‌రుగుతుంది.

ghost symptoms in your home

దెయ్యం మ‌న ద‌గ్గ‌ర ఉంటే దెయ్యం ఉన్న చోట బాగా చ‌ల్ల‌గా ఉంటుంది. చుట్టూ ఎంత వేడిగా ఉన్నా స‌రే స‌డెన్‌గా మ‌న ద‌గ్గ‌ర వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉందంటే.. అక్క‌డ దెయ్యం ఉన్న‌ట్లు భావించాలి. ఇక ఇంట్లో మ‌నుషులు తిర‌గ‌కున్నా వింత శ‌బ్దాల‌ను.. అందులోనూ ముఖ్యంగా రాత్రి పూట ఆ శ‌బ్దాల‌ను వింటుంటే.. దెయ్యం ఉన్న‌ట్లేన‌ని అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కోసారి మ‌నుషులు లేకున్నా నీడ‌లు మ‌న‌కు క‌నిపిస్తాయి. అలాగే వ‌స్తువులు వాటంత‌ట అవే క‌దులుతాయి. ఇవ‌న్నీ దెయ్యం ఇంట్లో ఉంద‌ని చెప్పేందుకు ఉప‌యోగ‌ప‌డే సంకేతాలే. క‌నుక ఇలాంటి ల‌క్ష‌ణాలు, సంకేతాలు క‌నిపిస్తే వెంట‌నే జాగ్ర‌త్త ప‌డాలి. దెయ్యం ఉంద‌ని అనుకునే వారు త‌మ వద్ద ఎల్ల‌ప్పుడూ హ‌నుమంతుని చిత్ర‌ప‌టాన్ని ఉంచుకోవాలి. దీంతో ఎలాంటి దెయ్యం కాదు క‌దా.. ఏ శ‌క్తి మ‌న‌ల్ని ఏమీ చేయ‌లేదు.

Admin

Recent Posts