వినోదం

Jagadeka Veerudu Athiloka Sundari : జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి మూవీ బ‌డ్జెట్ రూ.8 కోట్లు.. వ‌చ్చింది ఎంతో తెలుసా..?

Jagadeka Veerudu Athiloka Sundari : టాలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోలుగా స‌త్తా చాటారు చిరంజీవి, బాల‌కృష్ణ‌. ఈ ఇద్ద‌రు హీరోల‌కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాల‌కృష్ణ ఎక్కువగా ఊర మాస్ చిత్రాల‌తో అల‌రించ‌గా, చిరంజీవి మాత్రం అన్ని ర‌కాల జోన‌ర్స్‌లో సినిమాలు చేశారు. ఆ నాటి నుండి ఈ నాటి వ‌ర‌కు చిరంజీవి, బాల‌కృష్ణల మ‌ధ్య మంచి స్నేహ‌ బంధం ఉంది. ఇక‌ సంద‌ర్భాన్ని బ‌ట్టి ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌లు కురిపించుకుంటారు, అలానే ప‌లు ఈవెంట్స్‌లో క‌లుసుకొని స‌ర‌దాగా ముచ్చ‌టిస్తారు కూడా. అయితే చిరంజీవి త‌న కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించాడు.

ఖైదీ, గ్యాంగ్ లీడ‌ర్, ప‌సివాడి ప్రాణం, అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వాట‌న్నింటిలో బాల‌కృష్ణకి ఒకే ఒక్క సినిమా అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. మ‌రి ఆ సినిమా మ‌రేదో కాదు జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి. ఈ సినిమాలో చిరుకు జోడీగా శ్రీదేవి హీరోయిన్ గా న‌టించింది. జంధ్యాల క‌థ‌ను అందించారు. సోషియో ఫాంట‌సి చిత్రంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మెప్పించింది. ఈ సినిమా అప్ప‌ట్లో రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్ప‌టికీ ఈ సినిమా టీవీ లో వ‌స్తే మిస్ కాకుండా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. బాల‌కృష్ణ కూడా ఈ సినిమాని చాలా ఇష్టంగా చూస్తార‌ట‌. ఆయ‌న‌కు చిరంజీవి అన్ని సినిమాల‌లో ఈ మూవీ చాలా ఇష్టం అని చెబుతుంటార‌ట‌.

Jagadeka Veerudu Athiloka Sundari movie collections

ప్రముఖ నిర్మాత సీ అశ్వినిదత్ తన సొంత బ్యానర్ వైజయంతీ మూవీస్‌పై జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో ఈ చిత్రానికి బడ్జెట్ రూ.8 కోట్లు. ఇప్పుటి పరిస్థితులతో పోల్చుకొంటే దాదాపు 63 కోట్ల రూపాయలుగా అంచనా వేసుకోవచ్చు. అన్ని విభాగాల్లో హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కించడం జరిగింది.ఈ చిత్రం 47 కేంద్రాల్లో 50 రోజులు, 29 కేంద్రాల్లో 100 రోజులు పండుగను చేసుకొన్నది. అప్పట్లో ఈ రేంజ్‌లో సినిమా ఆడటం ఓ రికార్డుగా సినీ వర్గాలు చెప్పుకొంటాయి. నాడు 13 కోట్లు రాబట్టిన ఈ చిత్రం నేటి లెక్క‌ల ప్రకారం చూస్తే.. 100 కోట్ల రూపాయలకుపైగానే ఉండటానికి ఆస్కారం ఉంది అని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Admin

Recent Posts