Green Chilli Pulao : ప‌చ్చి మిర్చి పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి.. టేస్ట్ భ‌లేగా ఉంటుంది..!

Green Chilli Pulao : మ‌నం వంట‌ల్లో ప‌చ్చిమిర్చిని విరివిరిగా వాడుతూ ఉంటాము. ప‌చ్చిమిర్చి వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని ఇవ్వ‌డంతో పాటు ప‌చ్చిమిర్చిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కూర‌లు,ప‌చ్చ‌ళ్లు, చ‌ట్నీల త‌యారీలో వాడడంతో పాటు ప‌చ్చిమిర్చితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చిమిర్చితో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా స్పెష‌ల్ గా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ప‌చ్చిమిర్చితో పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ప‌చ్చిమిర్చితో ఎంతో రుచిగా ఉండే పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌చ్చిమిర్చి పులావ్ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

నూనె – 5 టీ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టేబుల్ స్పూన్.

Green Chilli Pulao recipe in telugu make in this method
Green Chilli Pulao

స్ట‌ఫింగ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, సోంపు – ఒక టేబుల్ స్పూన్, వేయించిన ప‌ల్లీలు – 4 టేబుల్ స్పూన్స్, చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు- త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్,ప‌చ్చిమిర్చి – 10.

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన బియ్యం – 2 క‌ప్పులు, నీళ్లు – 4 క‌ప్పులు, బిర్యానీ ఆకులు – 2, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 3, త‌రిగిన కొత్తిమీర – ఒక చిన్న క‌ట్ట‌, త‌రిగిన పుదీనా – ఒక చిన్న క‌ట్ట‌, నెయ్యి -ఒక టేబుల్ స్పూన్.

ప‌చ్చిమిర్చి పులావ్ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ధ‌నియాలు, సోంపు, ప‌ల్లీలు, చింత‌పండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.తరువాత ఉప్పు, కారం, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి పేస్ట్ లాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ప‌చ్చిమిర్చికి నిలువుగా గాట్లు పెట్టి లోప‌ల ఉండే గింజ‌ల‌ను తీసివేయాలి. త‌రువాత ఈ ప‌చ్చిమిర్చిని ముందుగా త‌యారు చేసుకున్న పేస్ట్ తో స్ట‌ఫింగ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చిని వేసి మూత పెట్టి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో బియ్యం తప్ప మిగిలిన ప‌దార్థాల‌ను వేసి నీటిని మ‌రిగించాలి. నీరు మ‌రిగిన త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. ఈ బియ్యాన్ని 80 శాతం ఉడికించి వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి.

త‌రువాత 4 త‌రిగిన ప‌చ్చిమిర్చిని వేసుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉడికించిన అన్నాన్ని ఒక లేయ‌ర్ గా వేసుకోవాలి. త‌రువాత దీనిపై వేయించిన ప‌చ్చిమిర్చిని ఉంచాలి. ఇలా అన్నాన్ని, ప‌చ్చిమిర్చిని మ‌రో రెండు లేయ‌ర్ లుగా వేసుకోవాలి. చివ‌ర‌గా ఫుడ్ క‌ల‌ర్ ను లేదా కుంకుమ పువ్వు నీటిని పైన చ‌ల్లుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట‌పై 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మ‌రో 10 నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌చ్చిమిర్చి పులావ్ త‌యార‌వుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ప‌చ్చిమిర్చితో చేసిన పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts