Parijatham Tree : మన ఇంట్లో పెంచుకోదగిన అందమైన పూల మొక్కలల్లో పారిజాతం మొక్క కూడా ఒకటి. దేవతా వృక్షాలుగా కూడా వీటిని అభివర్ణిస్తూ ఉంటారు. ఈ పారిజాతం చెట్టు గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. దాదాపు అందరి ఇండ్లల్లో ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్కకు అందమైన పూలు పూస్తూ ఉంటాయి. ఈ పూలు తెలుపు రంగులో ఉండి కాడలు నారింజ రంగులో ఉంటాయి. ఈ చెట్టు ఆకులు వెడల్పుగా గరుకుగా ఉంటాయి. అలాగే ఈ పూలు చక్కటి వాసనను వెదజల్లుతాయి. ఈ చెట్టుకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ పూలూ రాత్రి పూట మాత్రమే పూసి తెల్లవారే సరికి రాలిపోతూ ఉంటాయి. అలాగే ఈ పూలను దైవారాధనకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
పరిమళాలు వెదజల్లే సెంట్ల తయారీలో, సహజంగా తయారు చేసే లిప్ స్టిక్ ల తయారీలో కూడా ఈ పూలను ఉపయోగిస్తూ ఉంటారు. చక్కటి పూలతో పాటు పారిజాతం చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ మొక్క ఆకులతో కషాయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ముందుగా పారిజాతం ఆకుల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీని కోసం మనం ఒక గ్లాస్ నీళ్లు, బెల్లం పొడి, పారిజాతం ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో చిన్నగా ఉండే 6 పారిజాతం ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోవాలి. తరువాత ఈ నీటిని సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి కప్పులో తీసులోకి తీసుకోవాలి.
ఈ కషాయం చేదుగా ఉంటుంది కనుక ఇందులో బెల్లం పొడిని వేసి కలిపి తీసుకోవాలి. దీనిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోడం వల్ల మంచి పలితం ఉంటుంది. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. విష జ్వరాలతో బాధపడే వారు ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల జ్వరాలు తగ్గు ముఖం పడతాయి. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే రక్తంలో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్లెట్స్ వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి అలాగే తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా పెంచడానికి కూడా ఈ కషాయం మనకు సహాయపడతాయి. మానసిక సమస్యలను దూరం చేయడంలో కూడా పారిజాత ఆకుల కషాయం తోడ్పడుతుంది.
ఈ కషాయాన్ని తాగడం వల్ల ఆర్థరైటిస్, సయాటికా నొప్పులు, గౌట్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. వెన్నుముకకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు కూడా ఈ కషాయాన్ని తీసుకోవచ్చు. వెరికోస్ వెయిన్స్, వరిబీజం, నరాలకు సంబంధించిన సమస్యలతో బాదపడే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల ఆయా సమస్యలు తగ్గు ముఖం పడతాయి. స్త్రీలు ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు తగ్గడంతో పాటు హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా పారిజాతం చెట్టు మనకు ఎంతగానో సహాయపడుతుందని ఈ చెట్టు ఆకులతో కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.