వినోదం

Hero : ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు.. ఇప్పుడు అగ్ర హీరో.. గుర్తు ప‌ట్టారా..?

Hero : లెజెండరీ నిర్మాత రామానాయుడు దగ్గుబాటి సినీ వారసుడిగా వెంకటేష్ వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. నటన పరంగా ఎన్నో ఘన విజయాలను అందుకుని విక్టరీ హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.1986లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు వెంకటేష్. ఆయన కెరీర్లో రాజా, గణేష్, సూర్యవంశం, కలిసుందాం రా.. వంటి ఎన్నో చిత్రాలతో ఘన విజయాన్ని అందుకున్నారు.

కానీ అందరూ మొదటిగా వెండితెరకు వెంకటేష్ పరిచయమైంది కలియుగ పాండవులు చిత్రంతో అని అనుకుంటారు. కలియుగ పాండవులు సినిమా వెంకటేష్ మొదటి సినిమా కాదు. ఈ సినిమా కన్నా ముందుగా వెంకటేష్ ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ప్రేమ్ నగర్ అనే సినిమాలో వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.

have you identified this star actor

ప్రేమ్ నగర్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించమని డి.రామానాయుడు.. వెంకటేష్ ను అడిగారట. ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే వెయ్యి రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తానని రామానాయుడు వెంకటేష్ కు చెప్పడంతో వెంటనే సరే అని వెంకటేష్ ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత 1986 లో కలియుగ పాండవులు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా ఖుష్బూ నటించారు.

అయితే అప్పటిలో ఖుష్బూ తండ్రికి ఆమె తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేదు. కానీ అప్పట్లో శ్రీదేవి, జయప్రద రాఘవేంద్ర రావు సినిమాలు చేస్తూ హిట్ ను అందుకున్నారు. అప్పటికే వీరు సీరియల్ హీరోస్ తో నటించడంతో యంగ్ హీరో వెంకటేష్ సరసన వీరు అంతగా బాగుండరు అనే ఉద్దేశంతో ఎలాగైనా ఖుష్బూతోనే కలియుగ పాండవులు అనే సినిమా చేయాలని అనుకున్నారు. 1986 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.

Admin

Recent Posts