వినోదం

మంత్రి కొండా సురేఖ‌కు షాకిచ్చిన నాగార్జున‌.. కోర్టులో ప‌రువు న‌ష్టం దావా..

మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీ ఇండ‌స్ట్రీ మొత్తం భ‌గ్గుమంటోంది. ఆమె వెంట‌నే నాగార్జున‌కు సారీ చెప్పాల‌ని, త‌న కామెంట్ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్నారు. సినీ లోకం అంతా ఒక్క‌టై మంత్రి కొండా సురేఖ‌పై మూకుమ్మ‌డి దాడిని సోష‌ల్ మీడియాలో మొద‌లుపెట్టారు. దీంతో ఆమె వెన‌క్కి త‌గ్గారు. త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు.

అయితే త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప సంహరించుకున్న‌ప్ప‌టికీ మంత్రి కొండా సురేఖ‌కు షాక్ త‌ప్ప‌లేదు. ఆమెకు న‌టుడు నాగార్జున షాకిచ్చారు. త‌న ప‌రువుకు భంగం క‌లిగించారంటూ నాగార్జున ఆమెపై ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ మేర‌కు ఆయ‌న నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే ఆమె ఓవైపు ఆ కామెంట్ల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న ఇలా కోర్టుకెళ్ల‌డం ఏమీ బాగాలేద‌ని కొంద‌రంటున్నారు.

nagarjuna went to court for konda surekha comments on him

కానీ నాగార్జునకు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌భుత్వం కూల్చివేసింది. దాన్ని మ‌న‌సులో పెట్టుకునే నాగార్జున ఇలా చేసి ఉంటార‌ని అంటున్నారు. అయితే ప‌రువు న‌ష్టం దావా వేసినందుకు మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారో చూడాలి.

Admin

Recent Posts