Horse Gram Paratha : ఉల‌వ‌ల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప‌రాటాలు.. త‌యారీ ఇలా..!

Horse Gram Paratha : ప‌రాటాలు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆలు క‌ర్రీతో వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఉద‌యం అల్పాహారం లేదా రాత్రి భోజ‌నంలో ప‌రాటాల‌ను లాగించేస్తుంటారు. అయితే ప‌రాటాను ఉల‌వ‌ల‌తోనూ త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్య‌క‌రం కూడా. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు పోష‌కాలు, శ‌క్తి రెండూ ల‌భిస్తాయి. వీటిని త‌యారు చేయడం కూడా సుల‌భ‌మే. ఉల‌వ‌ల‌తో ప‌రాటాల‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల‌వ‌ల ప‌రాటాల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాజ్మా – ఒక క‌ప్పు, ఉల‌వ‌లు – అర క‌ప్పు, ఉల్లిపాయ – ఒక‌టి, ప‌చ్చి మిర్చి త‌రుగు – 1 టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర‌, ధ‌నియాల పొడి, ఆమ్‌చూర్‌, గ‌రం మ‌సాలా పొడి, మిరియాల పొడి – అర టీస్పూన్ చొప్పున‌, కారం – 1 టీస్పూన్‌, ఉప్పు – రుచికి త‌గినంత‌, గోధుమ పిండి – ఒక క‌ప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్లు.

Horse Gram Paratha recipe in telugu very tasty and healthy
Horse Gram Paratha

ఉల‌వ‌ల ప‌రాటాల‌ను త‌యారు చేసే విధానం..

రాజ్మా, ఉల‌వ‌ల‌ను 8 గంట‌ల పాటు నాన‌బెట్టి కుక్క‌ర్‌లో ఉడికించాలి. చ‌ల్ల‌బ‌డ్డాక మిక్సీలో బ‌ర‌క‌గా రుబ్బుకుని ప‌క్క‌న పెట్టాలి. కొద్ది నూనెలో జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ‌, ప‌చ్చి మిర్చి త‌రుగు వేగించాలి. ఆమ్ చూర్‌, గ‌రం మ‌సాలా, కారం, ఉప్పు, మిరియాల పొడితోపాటు రుబ్బిన మిశ్ర‌మం కూడా వేసి బాగా క‌లిపి దించేయాలి. ఇప్పుడు త‌డిపి ముద్ద చేసిన పిండిని కొంత కొంత తీసుకుని ప‌రాటాలు వ‌త్తి మ‌ధ్య‌లో త‌గినంత ఉల‌వ‌ల మిశ్ర‌మం పెట్టి ద‌గ్గ‌ర‌గా మ‌డ‌వాలి. మ‌ళ్లీ నెమ్మ‌దిగా ప‌రాటాలు వ‌త్తి పెనంపై రెండు వైపులా నూనెతో కాల్చుకోవాలి. ఇలా అన్ని ప‌రాటాల‌ను చేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన ఉల‌వ‌ల ప‌రాటాలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ఏదైనా కూర‌తోనూ తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు. ప‌రాటాల‌ను రొటీన్‌గా చేసేందుకు బ‌దులుగా ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా మొత్తం తినేస్తారు.

Editor

Recent Posts