Wake Up At 3am : సాధారణంగా చాలా మంది రాత్రి పూట నిద్ర లేస్తుంటారు. మూత్ర విసర్జన చేయడం కోసం లేదా దాహం అయి నీళ్లను తాగడం కోసం.. రాత్రి పూట నిద్ర లేవాల్సి వస్తుంది. ఇక కొందరు నిద్రించే భంగిమ సరిగ్గా లేకపోవడం వల్ల ఒత్తిడి పడి కూడా నిద్ర లేస్తారు. అలాగే కొందరికి పీడకలల వల్ల కూడా నిద్రలో మెళకువ వస్తుంది. అయితే రాత్రి పూట 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేవడం సహజమే. అయినప్పటికీ రోజూ ఇలా జరుగుతుందంటే మాత్రం కచ్చితంగా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటేనే ఇలా రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ సమయంలో నిద్ర లేచేందుకు ఇంకా ఏయే కారణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో నిద్ర లేస్తే శరీరంపై ఒత్తిడి పడుతుంది. ఏదో ఒక రోజు అయితే ఫర్వాలేదు. కానీ రోజూ ఇలా రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తుంటే మాత్రం కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నవారు ఇలా రోజూ రాత్రి ఆ సమయంలో నిద్ర లేస్తారు. అలాగే మెడిసిన్లను వాడేవారు, షుగర్, బీపీ ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు.. రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తారు. అలాగే వయస్సు మీద పడడం, నిద్ర లేమి, పలు రకాల మందులను దీర్ఘకాలంగా వాడుతుండడం వంటి కారణాల వల్ల కూడా రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తారు.
యాంటీ డిప్రెసెంట్లు, బీటా బ్లాకర్స్, కార్టికో స్టెరాయిడ్స్, దగ్గు, జలుబు మందులను వాడడం, డై యూరెటిక్స్‌ను వాడడం వంటి కారణాల వల్ల రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేవాల్సి వస్తుంది. అయితే మందులను వాడడం తప్పించి మిగిలిన ఏ కారణం వల్ల అయినా సరే నిద్ర లేస్తుంటే మాత్రం ఆయా సమస్యల నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి. లేదంటే సమస్య మరింత తీవ్రతరం దాలుస్తుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక లివర్ పనితీరు మందగించడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల కూడా రాత్రి ఆ సమయంలో నిద్ర లేస్తారు. కాబట్టి.. ఎవరైనా సరే తమకు ఆ సమయంలో మెళకువ ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. దీంతో ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.