Hotel Style Mysore Masala Dosa : హోట‌ల్ స్టైల్‌లో మైసూర్ మ‌సాలా దోశ‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Hotel Style Mysore Masala Dosa : మ‌న‌కు హోటల్స్ లో, రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల వెరైటీ దోశ‌ల‌ల్లో మైసూర్ మ‌సాలా దోశ కూడా ఒక‌టి. మైసూర్ మ‌సాలా దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. చట్నీ, సాంబార్ తో క‌లిపి తింటే ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ మైసూర్ మ‌సాలా దోశ‌ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌నం ప‌ర్ఫెక్ట్ మ‌సాలా దోశ‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగాఉండే మైసూర్ మ‌సాలా దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మైసూర్ మ‌సాలా దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌పప్పు – ఒక క‌ప్పు, బియ్యం – 3 క‌ప్పులు, మెంతులు – 2 టీ స్పూన్స్, శ‌న‌గ‌పప్పు – 2 టేబుల్ స్పూన్స్, అటుకులు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌.

Hotel Style Mysore Masala Dosa recipe in telugu
Hotel Style Mysore Masala Dosa

రెడ్ చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, అర‌గంట పాటు నీటిలో నాన‌బెట్టిన ఎండుమిర్చి – 4, చింత‌పండు – ఒక రెమ్మ‌, పుట్నాల‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు -త‌గినంత‌.

ఆలూ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉల్లిపాయ ముక్క‌లు – అర కప్పు, ప‌చ్చిమిర్చి – 2, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప‌లు – 3, ఉప్పు – త‌గినంత‌, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

మైసూర్ మ‌సాలా దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మిన‌పప్పు, బియ్యం, మెంతులు, శ‌న‌గ‌పప్పు వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి 3 నుండి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత అటుకుల‌ను శుభ్రంగా క‌డిగి ఒక గంట‌పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీట‌న్నింటిని జార్ లో వేసి చ‌ల్ల‌టి నీళ్లు పోస్తూ మెత్త‌గా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత పిండిని మ‌రోసారి క‌లుపుకుని మూత పెట్టి 6 నుండి 8 గంట‌ల పాటు పులియ బెట్టాలి. పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత ఉప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోసి పిండిని క‌లుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత రెడ్ చ‌ట్నీ కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత నువ్వులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, చింత‌పండు వేసి మ‌గ్గించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లో వేసుకుని అందులోనే ఉప్పు, పుట్నాల ప‌ప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఆలూ మ‌సాలా కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి.

త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చిని, అల్లాన్ని, ప‌సుపును దంచి వేసుకోవాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత బంగాళాదుంపల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నిమ్మ‌ర‌సం, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దోశ కోసం స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక పిండి వేసి దోశ లాగా రుద్దుకోవాలి. దోశ త‌డి ఆరిన త‌రువాత నూనె వేసి కాల్చుకోవాలి. త‌రువాత రెడ్ చ‌ట్నీని వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత మ‌ధ్య‌లో ఆలూ మిశ్ర‌మాన్ని ఉంచి దోశ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మైసూర్ మ‌సాలా దోశ త‌యార‌వుతుంది. దీనిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts