food

ఇంట్లోనే ఎంతో సులభంగా జీరారైస్ తయారు చేసుకోండి ఇలా…?

చాలామందికి సమయానికి ఇంట్లో కూరగాయలు లేకపోతే ఏం కూర వండాలో దిక్కుతోచని స్థితిలో ఉంటారు. ఇలాంటి సమయంలోనే కేవలం అయిదు నిమిషాలలో ఎంతో రుచికరమైన జీరా రైస్ తయారు చేసుకోవడం ఏ విధంగానో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు

ఒక కప్పు బియ్యం, రెండు కప్పుల నీళ్లు, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా కొత్తిమీర తరుగు, 4 పుదీనా ఆకులు.

how to make jeera rice know the recipe

తయారీ విధానం

ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి, వేడి అయిన తరువాత టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపట అన్న తర్వాత పుదీనా, మిరపకాయలు వేయాలి మిరపకాయలు కొద్దిగా వేగిన తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అందులో వేసి ఆ మిశ్రమం మొత్తాన్ని బాగా కలియబెట్టాలి.

ముందుగా తీసుకున్న రెండు కప్పుల నీటిని ఈ మిశ్రమంలో వేసి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కాసేపు అలాగే తర్వాత మూత తీసి అన్నం పై కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్న ఈ జీరా రైస్ లోకి కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకుని తింటే అచ్చం హోటల్ రుచిని పొందవచ్చు.

Admin

Recent Posts