Krishna : సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతల మనిషిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. కృష్ణ చేసిన మూవీ ప్లాపై నిర్మాత నష్టపోతే అతనికి ఫ్రీగా ఒక సినిమా చేసేవారట. అడిగినవారికి అడిగినంత ఇచ్చేసేవారట. స్నేహం పేరుతో కృష్ణ వద్ద డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వని వారు కూడా ఎందరో ఉన్నారట. సినిమా పరిశ్రమనే జీవితం అనుకొని సినిమాల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశారు కృష్ణ. ఆయనకు కొన్ని కొన్ని చిత్రాలు తీవ్ర నష్టాలు మిగిల్చాయి.
1965లో తేనె మనసులు చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ టాలీవుడ్లో కొత్త శకం మొదలుపెట్టారు. కృష్ణ సినిమా రిలీజ్ అవుతుంటే పల్లెటూర్లలో మొత్తం బండ్లల్లో బయలుదేరే వారు గ్రామస్తులు. ఇక అంతలా పాపులారిటీ దక్కించుకున్న కృష్ణ ఆర్థికంగా ఓ రేంజ్‌లో ఉండాలి కాని ఆయన ఏనాడు డబ్బు కోసం వెంపర్లాడలేదు. డబ్బు మనిషి అస్సలు కాదు. నలుగురికి సాయపడాలని ఎప్పుడు భావిస్తుంటారు. సూపర్ స్టార్ కృష్ణ సంపాదించిన ఆస్తుల విలువ ఎంత అంటే రూ.400 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
డబ్బు విషయంలో అమాయకత్వం ,సెటిల్మెంట్స్ విషయంలో మధ్యవర్తిగా ఉండడం , కీలక సమయంలో కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడంతో కోట్లాది రూపాయలను నష్టపోయారు కృష్ణ. లేకుంటే ఆయన ఆస్తి సుమారుగా రూ. 500 కోట్లకు పైగా ఉండేదని అంచనా.. కానీ ఈయన వారసుడు మహేష్ బాబు మాత్రం ఏకంగా రూ.1300 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.అయితే కృష్ణ వీలునామా రాయగా, అందులో తన మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా తన ఆస్తి చెందాలని వీలునామాలో రాశారట. ఇక స్టెప్ సన్ నరేష్‌పై ఒక్క రూపాయి రాయలేదట. విజయనిర్మల ఆస్తులు ఎలాగు నరేష్‌కి చెందుతాయి కాబట్టి ఇలాంటి నిర్ణయం కృష్ణ తీసుకున్నారని టాక్.