Potato Chips : బ‌య‌ట షాపుల్లో ల‌భించే విధంగా.. ఆలు చిప్స్‌ను ఇంట్లోనే క‌ర‌క‌ర‌లాడేలా ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

Potato Chips : పొటాటో చిప్స్.. వీటిని చూడ‌గానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌క బ‌య‌ట హాట్ చిప్స్ షాపుల్లో కూడా ఈ పొటాటో చిప్స్ ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. బ‌య‌ట షాపుల్లో ల‌భించే ఈ చిప్స్ రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. అచ్చం అలాంటి చిప్స్ నే మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట షాపుల్లో ల‌భించే విధంగా పొటాటో చిప్స్ ను ఎలా త‌యారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో చిప్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బంగాళాదుంప‌లు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, ఉప్పు – కొద్దిగా, కారం – కొద్దిగా.

పొటాటో చిప్స్ త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌ను 2 గంట‌ల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి లేదా అర గంట పాటు డీప్‌ ఫ్రిజ్ లో ఉంచాలి. చిప్స్ ను త‌యారు చేసుకోవ‌డానికి ముందు ఫ్రిజ్ నుండి బంగాళాదుంప‌ల‌ను బ‌య‌ట‌కు తీసి పైన ఉండే పొట్టును తీయాలి. త‌రువాత వాటిని శుభ్రంగా క‌డ‌గాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసుకుని వాటిలో ఐస్ క్యూబ్స్ ను వేయాలి. త‌రువాత శుభ్ర‌ప‌రుచుకున్న బంగాళాదుంప‌ల‌ను కూడా ఆ నీటిలో వేయాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బంగాళాదుంప‌ను తీసుకుని పొడి వ‌స్త్రంతో శుభ్ర‌ప‌రుచుకుని స్లైస‌ర్ తో చిప్స్ ఆకారంలో త‌రిగి నూనెలో వేసి కాల్చుకోవాలి.

how to make Potato Chips more crispy and spicy
Potato Chips

స్లైస‌ర్ ను నేరుగా క‌ళాయి మీద ఉంచి చిప్స్ ను త‌రిగి నూనెలో వేసి కాల్చుకోవ‌చ్చు. అలా చేయ‌డం రాని వారు ఒక ప్లేట్ లో ముందుగా చిప్స్ ఆకారంలో త‌రిగి త‌రువాత నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ చిప్స్ ను మ‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి. చిప్స్ రంగు మారి క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత వాటిపై త‌గినంత ఉప్పు, కారం చ‌ల్లుకుని క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అచ్చం హాట్ చిప్స్ లో ల‌భించే విధంగా ఉండే పొటాటో చిప్స్ త‌యార‌వుతాయి. ఈ చిప్స్ ను స్టార్చ్ త‌క్కువ‌గా ఉండే బంగాళాదుంప‌ల‌తో త‌యారు చేసుకుంటే చాలా రుచిగా, చ‌క్క‌గా ఉంటాయి.

సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చాలా త్వ‌ర‌గా అయ్యే పొటాటో చిప్స్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఈ పొటాటో చిప్స్ ను ఇష్టంగా తింటారు. బ‌య‌ట ప్యాకెట్ ల‌లో ల‌భించే పొటాటో చిప్స్ ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే చిప్స్ ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

Share
D

Recent Posts