Cinnamon Face Pack : దాల్చిన చెక్క‌లో ఒక్క స్పూన్ ఇది క‌లిపి రాయండి.. మీ ముఖం తెల్ల‌గా మారుతుంది..

Cinnamon Face Pack : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో ల‌భించే అన్ని ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్ల‌ర్ కి వెళ్ల‌డం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ అందం పెర‌గ‌క‌పోగా మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. బ‌య‌ట ల‌భించే బ్యూటీ ప్రొడ‌క్ట్స్ లో ర‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా వాడ‌తారు. వీటి వ‌ల్ల చ‌ర్మం దెబ్బ‌తినే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. స‌హజ ప‌దార్థాల‌తో ఇంట్లోనే ఫేస్ ఫ్యాక్ ల‌ను త‌యారు చేసుకుని వాడడం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ అందాన్ని పెంచే స‌హ‌జ సిద్ద ఫేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో తేనెను తీసుకోవాలి.

త‌రువాత అందులో అంతే ప‌రిమాణంలో పెరుగును వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరిన త‌రువాత నీటితో క‌డిగి వేయాలి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గిపోతాయి. అలాగే ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల కొబ్బ‌రి నూనెను తీసుకోవాలి. త‌రువాత అందులో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీ స్పూన్ అల్లం తురుము, ఒక టీ స్పూన్ పంచ‌దార వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మం స‌హ‌జ సిద్ద స్క్ర‌బ‌ర్ గా ప‌ని చేస్తుంది. ఈ మిశ్ర‌మాన్ని తీసుకుని ముఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం ఉండే మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి. బేకింగ్ సోడాను ఉప‌యోగించి కూడా మ‌నం ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ఒక గిన్నెలో బేకింగ్ సోడాను, కొద్దిగా ఆలివ్ నూనెను వేసి పేస్ట్ గా క‌లుపుకోవాలి.

Cinnamon Face Pack use this at night for better results
Cinnamon Face Pack

త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుంటూ స్క్ర‌బ్ చేస్తూ మ‌ర్ద‌నా చేస్తూ శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా ముఖాన్ని శుభ్ర‌ప‌రిచిన వెంట‌నే మ‌నం ముఖం మృదువుగా మార‌డాన్ని, ముఖంలో మార్పు రావ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఎలాంటి ర‌సాయ‌నాలు వాడ‌కుండా మొటిమ‌లను మ‌నం తగ్గించుకోవ‌చ్చు. దీని కోసం ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అందులో తుల‌సి ఆకులు వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ తుల‌సి ఆకుల నీటిని టోన‌ర్ గా వాడ‌డం వ‌ల్ల మొటిమ‌లు తగ్గుతాయి. అదేవిధంగా రోజ్ వాట‌ర్ మ‌న ముఖానికి మంచి టోన‌ర్ గా పని చేస్తుంది. దీనిలో విట‌మిన్స్, ఖ‌నిజ ల‌వ‌ణాలు అధికంగా ఉంటాయి. ఒక గిన్నెలో రోజ్ వాట‌ర్ ను తీసుకుని దానిలో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం యొక్క రంగు పెరుగుతుంది. మ‌నం ఆహారంగా తీసుకునే క‌ర్జూరాల‌ను ఉప‌యోగించి కూడా మ‌నం మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు. ఒక గిన్నెలో పాలు, కొద్దిగా ప‌సుపు, ఒక టేబుల్ స్పూన్ క‌ర్జూరం పేస్ట్ వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ఫ్యాక్ ల వేసుకోవాలి. 20 నిమిషాల త‌రువాత ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా మ‌న దరి చేర‌కుండా ఉంటాయి. చ‌ర్మం పై ఉండే ముడ‌త‌లు, స‌న్న‌ని చార‌లు కూడా తొల‌గిపోతాయి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త‌క్కువ ఖ‌ర్చులో ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చ‌ని సౌంద‌ర్య నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts