Cracked Heels : పాదాల పగుళ్లు.. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. పాదాలు పగుళ్లకు గురి అయ్యి నొప్పిని కలిగిస్తాయి. దీంతో మనం ఒక్కోసారి నడవలేకపోతుంటాం. ఈ బాధ పాదాళ్ల పగుళ్లతో బాధపడే వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ పాదాల పగుళ్లను నిర్లక్ష్యం చేసే సమస్య మరింత తీవ్రమయ్యి పగుళ్ల నుండి రక్తం కారడం వంటివి జరుగుతుంటాయి. పాదాల పగుళ్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తగినంత నీటిని తీసుకోకపోవడం, శరీరంలో అతి వేడి వంటి వాటిని పాదాల పగుళ్లు రావడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.
పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, పాదాలపై దుమ్ము, ధూళి అధికంగా చేరడం వంటి వాటి వల్ల పాదాల పగుళ్లు ఏర్పడతాయి. ఈ సమస్య చలికాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు. పాదాల పగుళ్లతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కొవ్వొతిని, కొబ్బరి నూనెను, విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కొవ్వొత్తిని తురుముగా చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కొవ్వొతి తురుమును తీసుకోవాలి. తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను వేయాలి.ఇప్పుడు ఈ గిన్నెను ఒక వేడి నీటిలో ఉంచి కొవ్వొతి కరిగే వరకు కలుపుతూ ఉండాలి. తరువాత ఈ మిశ్రమంలో 2 విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేసి కలుపుకోవాలి. కాళ్ల పగుళ్ల వల్ల అడుగు తీసి అడుగు వేయలేని వారు రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పగుళ్ల మీద రాసి పడుకోవాలి.
ఉదయాన్నే నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాల పాటు చేయడం వల్ల పాదాల పగుళ్లు నయం అవుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే పాదాలకు శుభ్రం ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే తగినంత నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో రాకండా ఉంటాయి. పాదాలు అందంగా మారతాయి.