lifestyle

Jasmine Flowers : భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏం జరుగుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..!

Jasmine Flowers : ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు. ఒక వేళ అలా పెడితే మొక్కుకోవాలి. నల్లపిల్లి ఎదురైతే కీడు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం అపశకునం.. ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లల్లో మనం నిత్యం వింటూనే ఉంటాం. వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టిపారేసినా.. మరికొందరు ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు. అయితే వీటి వెనుక ఎంతో సైన్స్ దాగుంటుంది అన్న‌ది స‌త్యం. ఇక అలాంటిదే ఒక న‌మ్మ‌కం ఉంది. అదేమిటంటే.. భ‌ర్త త‌న భార్య‌కు రోజూ మ‌ల్లెపూల‌ను తీసుకెళ్లడం. అవును.. అదే.. ఇంత‌కీ ప్రతి రోజూ భార్యకు భ‌ర్త‌ మల్లెపూలు తీసుకెళ్ల‌డం వలన ఏం జరుగుతుందో తెలుసా.. దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకోండి.

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. నిజమే ఇంట్లో ఆడవారుంటే ఆ కళే వేరు. అలాంటి ఆడవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్ళు ఎంత ఒద్దిగ్గా, అందంగా, ఆనందంగా సంసారాన్ని సాగిస్తే ఆ ఇంట్లో వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది. మనిషిని వేధించే సమస్యల్లో ఒకటి ఆర్దికసమస్యలు. అలాంటి సమస్యలు దూరం కావాలంటే ముందు మీ ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచండి. మగవారు భార్యకు రోజూ మూరెడు మల్లెపూలను కొని తీసుకువెళ్తే చాలా మంచిద‌ట‌.

husband must give jasmine flowers to wife

మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేక పోతే ఇలా తప్పకుండా చేయండి. ప్రతి రోజూ ఆమె తలలో మల్లె పూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు. ఇదే కాక పరిమళ భరితమైన జాజి, విరజాజివి వంటివి కూడా ఇవ్వచ్చు. శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. క‌నుక పురుషులు ఈ చిన్న చిట్కాను పాటిస్తే శుక్రుని అనుగ్ర‌హం పొంది త‌ద్వారా వ్యాపార‌, ఉద్యోగ రంగాల్లో రాణించ‌వ‌చ్చు. దాంతో డ‌బ్బు సంపాదిస్తారు. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి.

Admin

Recent Posts