Dream : రాత్రి నిద్రించే సమయంలో కలలు రావడం సహజం. కొన్ని సార్లు మనం రోజూ చేసే పనులకు అనుగుణంగా కలలు వస్తూ ఉంటూ ఉంటే కొన్నిసార్లు ఊహకి అందని కలలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు మంచి కలలు వస్తే, కొన్నిసార్లు చెడు కలలు వస్తూ ఉంటాయి. మంచి కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తే, చెడు కలలు మాత్రం మనకు భయాన్ని, ఆందోళలను కలిగిస్తాయి. కొందరు ఉదయం లేవగానే ఈ కలలను మర్చిపోతూ ఉంటారు. కొందరు మాత్రం కలలో వచ్చిన వాటికి అర్థం తెలియక రోజంతా భయాందోళనలకు గురి అవుతూ ఉంటారు. అలాగే కొందరికి అప్పుడప్పుడూ కలల్లో గంగానది, ఆవు, భగవగ్దీత వంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలా కలలో ఇవి కనిపించడం మంచిదేనా… ఇవి కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో గంగానది, ఆవు, భగవద్గీత వంటివి కనిపిస్తే చాలా శుభప్రదం. హిందూ సంప్రదాయంలో గంగానదికి ఎంతో ప్రాధాన్యత, పవిత్రత ఉన్నాయి. అలాగే ఆవు, భగవద్గీతను కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. కలలో గంగానదిని చూడడం, నదిలో స్నానం చేయడం వంటివి కనిపిస్తే ఎంతో అదృష్టదాయకం. రాబోయే సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని దాని అర్థం. ఆవును కూడా హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. కలలో ఆవు కనిపించడం కూడా ఎంతో శుభసూచకం. కలలో ఆవు కనిపిస్తే త్వరలో మీకు అదృష్టం కలిసి వస్తుందని, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు రాబోతున్నాయని దాని అర్థం. అదేవిధంగా కలలో భగవద్గీత కనిపించడం కూడా చాలా శుభదాయకం. చాలా కొద్ది మందికి మాత్రమే కలలో భగవద్గీత కనిపిస్తుంది.
గీతను తాకడం, చూడడం, చదవటం కలలు వస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. భగవద్గీత కలలో కనిపిస్తే శ్రీ కృష్ణుడి అనుగ్రహం మీరు పొందినట్టేనని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా కలలో గంగానది, ఆవు, భగవద్గీత కనిపిస్తే అసలు భయపడవద్దని ఇవి కనిపించడం వల్ల చాలా శుభదాయకం అని పండితులు చెబుతున్నారు.