Money Plant : ఇంటికి అలంకరణగా ఉండడంతోపాటు ఇంటికి, ఇంట్లోని వారికి మంచి జరుగుతుందని మనం రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అలాంటి వాటిల్లో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. దీనిని చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే దీనిని పెంచుకోవడం వల్ల అసలు లాభాలు ఉంటాయా.. అని చాలా మంది సందేహిస్తూ ఉంటారు. మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకోవడం వల్ల ధనం వస్తుందా, అసలు మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అది దేనిని సూచిస్తుంది.. ఇంట్లో మనీ ప్లాంట్ ను ఎక్కడ, ఏవిధంగా పెట్టుకోవాలి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ మన ఇంట్లోకి ధనం వస్తుందా, రాదా అని సూచిస్తుంది. మనం పెంచుకునే మనీప్లాంట్ చక్కగా పెరుగుతూ, పైకి ఎగబాకుతూ, ఆకులను వేస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో ధనం వస్తుందని అర్థం. అలా కాకుండా మనం దానికి ఎన్ని నీళ్లు పోసినా, ఎంత పోషణను ఇచ్చినా కూడా ఈ చెట్టు ఆకులు ఎండిపోతూ ఉంటే మనకు రావల్సిన డబ్బుకు అడ్డంకులు పడుతున్నాయని అర్థం. మనకు రావల్సిన డబ్బులు ఆగిపోతున్నాయని అర్థం. అలాగే కొన్ని ఆకులు రంగు మారుతాయి. ఇలా ఆకులు రంగు మారితే డబ్బు వస్తుందని, డబ్బు నిలబడుతుందని అర్థం.
ఈ మొక్క నేల మీద , కుండీలోనూ అలాగే నీడలోనూ, ఎండలోనూ పెరుగుతుంది. దీనిని ఇంట్లో ఆగ్నేయం వైపున పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ మొక్క ఎంత బాగా పెరిగితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సార్లు ఈ మొక్క ఏపుగా పెరిగినప్పటికీ ఇంట్లోకి ధనం రావడం లేదని చాలా మంది చెబుతూ ఉంటారు. ధనం రాకపోయినా వారి ఇండ్లల్లో స్థిరాస్తులు పెరుగుతాయని వారు చెబుతున్నారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎటువంటి నష్టం జరగదని ఒక వేళ ఆగ్నేయం మూలన స్థలం లేకపోతే దీనిని ఉత్తర దిక్కున పెంచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. మన ఇంట్లోకి ధనం వస్తుందా.. రాదా.. అని తెలియజేయడానికి ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఇచ్చే సంకేతాలను బట్టి మన ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.