Daridra Devatha : ఇంట్లో ద‌రిద్ర దేవ‌త ఉందా.. లేదా.. అని ఎలా తెలుసుకోవాలి.. ల‌క్ష్మీ క‌టాక్షం క‌ల‌గాలంటే ఏం చేయాలి..?

Daridra Devatha : ల‌క్ష్మీ దేవి క‌టాక్షాన్ని పొందాల‌ని అంద‌రూ ఎంతో ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. లక్ష్మీ దేవి క‌టాక్షాన్ని పొందాలంటే మొద‌ట మ‌న ఇంట్లో నుండి ద‌రిద్ర‌ దేవ‌త వెళ్లిపోవాలి. ద‌రిద్ర దేవ‌త ఇంట్లో నుండి వెళ్లిపోవాలంటే ఏం చేయాలి.. అస‌లు ఇంట్లో ద‌రిద్ర దేవ‌త‌ ఉందా.. లేదా.. అని ఎలా తెలుసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎవ‌రైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో ద‌రిద్ర దేవ‌త తిష్ట వేసుకుని కూర్చుంటుంద‌ట‌. అలాగే ఇళ్లు అశుభ్రంగా ఉండి వాస‌న వ‌స్తూ ఉంటే కూడా ఇంట్లో ద‌రిద్ర దేవ‌త‌ ఉంటుంద‌ట‌.

ఎవరి ఇంట్లో అయితే డ‌బ్బు నిల‌వ‌దో.. అలాగో ఇంట్లో ప్ర‌తిరోజూ ఎవ‌రైనా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో ల‌క్ష్మీదేవి లేద‌ని అర్థం. ఎప్పుడూ నిద్ర పోయే వారి ఇంట్లో, ఎప్పుడూ మాన‌సిక ఆందోళ‌నకు గుర‌య్యే వారి ఇంట్లో ద‌రిద్ర దేవ‌త ఉంటుంది. శుభ‌కార్యాలు జ‌ర‌గ‌ని ఇండ్లల్లో, భార్యా భ‌ర్త మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగే ఇండ్ల‌ల్లో క‌చ్చితంగా ద‌రిద్ర దేవ‌త ఉంటుంది. అలాంట‌ప్పుడు ఇంట్లో ఉండే ద‌రిద్ర దేవ‌త బ‌య‌ట‌కు పోయి ల‌క్ష్మీ కటాక్షం క‌ల‌గ‌డానికి గాను ప్ర‌తి రోజూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నిత్యం దీపారాధ‌న చేస్తూ ఉండాలి. అలాగే ధూపాన్ని కూడా వేయాలి. ఇంటిని శుభ్రం చేసేట‌ప్పుడు నీటిలో ప‌సుపును, క‌ర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో సువాస‌న వ‌చ్చేలా పూజ చేసేట‌ప్పుడు అగ‌ర బ‌త్తుల‌ను వెలిగించాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ద‌రిద్ర దేవ‌త ఉండ‌దు.

how to know Daridra Devatha is in your home
Daridra Devatha

ఇలా క‌నీసం 21 రోజుల పాటు లేదా 48 రోజుల పాటు చేయాలి. అలాగే త‌ప్ప‌కుండా శుక్ర‌వారం ల‌క్ష్మీ దేవికి కుంకుమ‌తో పూజ చేయాలి. శ‌నివారం రోజు కొబ్బ‌రి కాయ కొట్టాలి. అలాగే ఇంటిని ఉత్త‌రం వైపు నుండి ద‌క్షిణం వైపు, తూర్పు వైపు నుండి ప‌డ‌మ‌ర వైపు ఊడ్చుకోవాలి. అలాగే ఇంటి ముందు స్వ‌స్తిక్ గుర్తు వ‌చ్చేలా ముగ్గును వేయ‌కూడ‌దు. దీనిని దైవ సంబంధిత కార్య‌క్ర‌మాల‌లో మాత్ర‌మే ముగ్గుగా వేయాలి. అంద‌రు తొక్కే ప్ర‌దేశంలో స్వ‌స్తిక్ గుర్తును వేయ‌కూడ‌దు. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఇంట్లో నుండి ద‌రిద్ర దేవ‌త‌ వెళ్లిపోతుంది. అలాగే ల‌క్ష్మీ దేవి క‌టాక్షాన్ని కూడా మ‌నం పొంద‌వ‌చ్చు.

D

Recent Posts