ఆధ్యాత్మికం

Lord Surya Idols : సూర్యుడికి చెందిన ఈ 6 విగ్ర‌హాల‌ను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే.. ల‌క్ మీ వెంటే.. సంప‌ద సిద్ధిస్తుంది..!

Lord Surya Idols : హిందూ పురాణాల్లో సూర్య దేవునికి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. చాలా మంది సూర్యున్ని రోజూ పూజిస్తారు, ప్రార్థిస్తారు కూడా. కొంద‌రు సూర్య న‌మ‌స్కారాలు చేస్తారు. నిజానికి సూర్యుడు జ్ఞానానికి ప్ర‌తీక‌. ఆయ‌న్ను పూజిస్తే జ్ఞానం, సంప‌ద ల‌భిస్తాయ‌ని న‌మ్ముతారు. ఆ కోవ‌లోనే చాలా మంది సూర్యున్ని నిత్యం పూజిస్తారు. అయితే ప‌లు ర‌కాల లోహాల‌తో చేసిన సూర్యుని బొమ్మ‌ల‌ను పూజించినా కూడా ముందు చెప్పిన విధంగా లాభాలు క‌లుగుతాయ‌ట‌. మ‌రి సూర్యునికి చెందిన ఏ త‌ర‌హా బొమ్మ‌ల‌ను పూజించాలో ఇప్పుడు తెలుసుకుందామా.

స్థోమ‌త ఉన్న వారు బంగారంతో చేసిన సూర్యుని విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. దీంతో అమిత‌మైన సంప‌ద క‌లుగుతుంది. ఇంట్లో ఉన్న వారికి జ్ఞానం సిద్ధిస్తుంది. కొత్త‌గా పెళ్ల‌యిన దంప‌తులు రాగితో చేసిన సూర్యుని విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించాలి. దీంతో వారి వైవాహిక జీవితం బాగుంటుంది. పిల్ల‌లు త్వ‌ర‌గా క‌లుగుతారు. కుటుంబ స‌భ్యులు ఆరోగ్యంగా ఉంటారు. వెండితో చేసిన సూర్యుని విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే స‌మాజంలో అంద‌రి మ‌ధ్య గౌర‌వం పెరుగుతుంది. పేరు, ప్ర‌ఖ్యాతులు వ‌స్తాయి. కెరీర్ బాగుంటుంది. నిరుద్యోగుల‌కు మంచి ఉద్యోగం వ‌స్తుంది. ఉద్యోగులు ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటారు.

put these lord surya idols in home and do pooja for luck

రాయి లేదా మ‌ట్టితో చేసిన సూర్యుని విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ల‌క్ క‌లసి వ‌స్తుంది. ప‌నులు స‌కాలంలో పూర్త‌వుతాయి. ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురు కావు. కుటుంబ స‌భ్యుల నుంచి శుభ‌వార్త వింటారు. చెక్క‌తో చేసిన సూర్యుని బొమ్మ‌ను ఇంట్లో పెట్టుకుని ప్రార్థిస్తే స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. అదృష్ట‌వంతులుగా మారుతారు. అనుకున్న‌వి నెర‌వేరుతాయి. జీవితాంతం కుటుంబ స‌భ్యులు ఆరోగ్యంగా ఉంటారు. గ్లాస్ లేదా ఇనుము తో చేసిన సూర్యుని బొమ్మ‌లు, విగ్ర‌హాల‌ను మాత్రం ఇంట్లో అస్స‌లు పెట్టుకోకూడ‌దు. వీటి వ‌ల్ల దుర‌దృష్టం వెంటాడుతుంది. ఏది చేసినా క‌ల‌సి రాదు. అనుకున్న ప‌నులు పూర్తి కావు. అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయి. కుటుంబ స‌భ్యుల ఆరోగ్యం బాగుండ‌దు.

Admin

Recent Posts