వినోదం

Gopichand : గోపీచంద్‌కు అస‌లు సినిమాలు చేయ‌డం ఇష్టం లేద‌ట‌.. మ‌రి ఎందుకు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు..?

Gopichand : రెవల్యూషనరీ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు గోపిచంద్. తన డెబ్యూ మూవీ తొలి వలపుతో అందరిని ఆకర్షించాడు. వెంటనే తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా చేసి తన నటనతో మరో కోణాన్ని చూపించాడు. అయితే కెరీర్ పరంగా గోపిచంద్ కి బ్రేక్ ఇచ్చింది మాత్రం రవి కుమార్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యజ్ఞం సినిమానే. అనంతరం కెరీర్ పరంగా ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్నాడు గోపిచంద్. ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్టు, చాణక్య, పంతం వంటి డిజాస్ట‌ర్ సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి.

ఆ మధ్య వచ్చిన సీటిమార్ కొంత పర్వాలేదు అనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ తో మళ్లీ నిరాశ పరిచాడు. జయాపజయాలను పక్కన పెడితే మాస్ యాక్షన్ సినిమాలతో పాటు గోపీచంద్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఇదిలావుండగా అసలు గోపీచంద్ కు నటనపై ఆసక్తి లేదట. గోపిచంద్ తండ్రి టి.కృష్ణ ఒకప్పుడు దర్శకుడిగా రాణించారు. ఇక గోపీచంద్ అన్న ప్రేమ్ చంద్ కూడా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

do you know that gopi chand does not want to come into movies

ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. ఆ తర్వాత ప్రేమ్ చంద్ యాక్సిడెంట్ లో కన్నుమూసారు. అయితే అప్పటికే గోపీచంద్ సినిమాలపై ఆసక్తి లేక ఇంజనీరింగ్ చదవడానికి రష్యాకు వెళ్లారు. కానీ అన్న మరణవార్త తెలుసుకొని తిరిగి ఇండియాకు చేరుకున్నాడు. గోపీచంద్ తండ్రి టి.కృష్ణ కుటుంబం నుండి ఎవరైనా ఒకరు ఇండస్ట్రీలో ఉండాలని కోరడంతో గోపీచంద్ ఇష్టం లేకపోయినా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం మాచో స్టార్ గోపీచంద్ కు కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

Admin

Recent Posts