technology

మీ వ‌ద్ద వాడ‌ని పాత స్మార్ట్ ఫోన్ ఉందా.. పైసా ఖ‌ర్చు లేకుండా దాన్ని సీసీటీవీ కెమెరాగా మార్చేయండి ఇలా..!

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్కరి ఇంట్లో సీసీ టీవీ మ‌న‌కు క‌నిపిస్తూనే ఉంది. ఆఫీసులు, బ్యాంకులు వంటి ప్ర‌దేశాల‌లో అయితే సీసీ టీవీ త‌ప్ప‌నిస‌రి. అయితే భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చటం తప్పనిసరిగా మారడంతో కొంద‌రు వేలు ఖ‌ర్చు చేసి ఇంట్లో సీసీ కెమెరాలు అమ‌ర్చుకుంటున్నారు. అయితే ఇది ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని కాబ‌ట్టి కొంద‌రు ఆలోచిస్తున్నారు కూడా. ఒక్క సీసీ కెమెరా అమరచడానికి దాదాపు 5వేల రూపాయల ఖర్చు అవుతుంది. అయితే సెక్యూరిటీ కోసం ఇంట్లో అంత ఖర్చు చేసి సీసీ కెమెరా అమచకుండానే పాత మొబైల్ ఫోన్ ద్వారా నిత్యం మన ఇంటి భద్రతను నిత్యం పర్యవేక్షించవచ్చు. ఇది విన‌డానికి కాస్త ఆశ్చ‌ర్యంగా అనిపించిన కూడా పాత మొబైల్ ఫోన్ ని సీసీ కెమెరాగా అమ‌ర్చుకోవ‌చ్చు.

మార్కెట్‌లోకి కొత్త కొత్త ఫోన్లు వస్తున్నప్పుడు చాలా మంది పాత ఫోన్‌ ఉన్నా కూడా కొత్తది కొంటుంటారు. ఇలా మీ వద్ద కూడా పాత ఫోన్ ఉంటే.. మీరు సులభంగానే సీసీ టీవీ సెటప్ చేసుకోవచ్చు. దీని కోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి అల్ఫ్రెడ్ కెమెరా అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో లాగిన్ అవ్వాలి. అలాగే మీ కొత్త ఫోన్‌లో కూడా ఇదే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మీ కొత్త ఫోన్‌తో మీ ఇంట్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఏం జరుగుతోందో చూడొచ్చు. మీరు పాత ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ పరిస్థితులు గమనించొచ్చు. అయితే నెట్ కనెక్టివిటీ బాగుండాలి. మ‌రోవైపు రెండు ఫోన్లలోనూఆల్‌ఫ్ర‌డ్ సీసీటీవీ కెమెరా అనే ఒక సెక్యూరిటీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దీనికి గూగుల్ ఖాతా ద్వారా సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ అయ్యాక.. ఒకదానిలో ‘కెమెరా’, మరొక దానిలో ‘వ్యూవర్’ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు మీ పాత ఫోన్‌ను ఇంట్లో ఒక చోట అమర్చాలి. ఈ ఫోన్‌కు నిరంతరం ఇంటర్నెట్‌ కనెక్షన్ ఇవ్వాలి. అలాగే, ఫోన్ బ్యాటరీ అయిపోకుండా ఛార్జింగ్ కనెక్ట్ చేయాలి. ఇక ఇప్పుడు ‘వ్యూవర్’ అనే ఆప్షన్ ఎంచుకున్న ఫోన్ ద్వారా మీరు ఇంటికి దూరంగా ఉన్నా కూడా నిరంతరం మానిటర్ చేయవచ్చు.

if you have unused smart phone then convert it into cctv camrea

మ‌రో ఆప్ష‌న్ ఏంటంటే ముందుగా మీ ప్లే స్టోర్ నుండి ఐపీ వెబ్ క్యామ్ యాప్ ఇన్‌స్టాల్ చేయండి. యాప్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే, దిగువన ఉన్న స్టార్ట్ సర్వర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.మీ నుండి కొన్ని అనుమతులు అడగబడతాయి, వాటిని అనుమతించండి. అనుమతిని అనుమతించిన తర్వాత, మీ మొబైల్‌లో కెమెరా ఓపెన్ అవుతుంది. స్క్రీన్ దిగువన ఒక ఐపీచిరునామా కనిపిస్తుంది, దానిని మీ మొబైల్ బ్రౌజర్ యొక్క లింక్ అడ్రస్ బార్‌లో ఐపీ అని టైప్ చేసి నమోదు చేయండి. ఐపీ చిరునామాను నమోదు చేయడానికి, ఐపీ వెబ్‌క్యామ్ వెబ్‌సైట్ మీ ఫోన్‌లో తెరవబడుతుంది. ఆడియో-వీడియో కోసం రెండు ఆప్ష‌న్స్ ఉంటాయి. అందులో వీడియో రెండరింగ్ మరియు ఆడియో ప్లేయర్ ఉంటాయి. మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఈ రెండు ఎంపికలని ఎంచుకోవచ్చు. మీరు వీడియోను చూడాలనుకుంటే, వీడియో రెండరింగ్‌ని ఎంచుకుని, బ్రౌజర్‌పై క్లిక్ చేయండి. అదే సమయంలో, మీరు వీడియోతో పాటు ఆడియోను చూడాలనుకుంటే, వీడియో ప్లేయర్‌తో ఇచ్చిన ఫ్లాష్ ఎంపికపై క్లిక్ చేయండి.

Sam

Recent Posts