lifestyle

చ‌నిపోయిన వారు తిరిగి అదే కుటుంబంలో పుడ‌తారు.. ఇలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..?

పూర్వ‌కాలం నుంచి మ‌న పెద్ద‌లు న‌మ్ముతున్న అనేక విశ్వాసాలు ఉన్నాయి. అయితే కొన్ని విశ్వాసాల‌కు శాస్త్రాల ప‌రంగా ప్రాధాన్య‌త కూడా ఉంది. కొన్నింటిని చెబితే చాలా మంది న‌మ్మ‌లేరు. కానీ వాటి వెనుక ఎంతో నిగూఢ విష‌యాలు దాగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే అలాంటి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా ఎవ‌రైనా వ్య‌క్తి చ‌నిపోతే అత‌ను లేదా ఆమె తిరిగి అదే కుటుంబంలో పుడ‌తార‌ట‌. అవును.. ఇలా చాలా మందికి జ‌రిగే ఉంటుంది. కానీ ఎవ‌రూ న‌మ్మ‌రు. అయితే ఒక్కోసారి ఇలా చ‌నిపోయిన వారు తిరిగి అదే కుటుంబంలో ఏడాది తిరిగే లోపే పుడ‌తారు. కానీ కొంద‌రు ఇలా పుట్టేందుకు ఆల‌స్యం అవుతుంది. అయితే ఎప్పుడు పుట్టినా స‌రే.. ఇలా జ‌రిగేందుకు రెండు బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయ‌ని శాస్త్ర నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అవేమిటంటే..

death person will born in same family know the reasons

ఒక వ్య‌క్తి అర్ధాంత‌రంగా చ‌నిపోతే భూమిపై అత‌ను చేయాల్సిన ప‌నులు ఇంకా పూర్తి కావు. అందుక‌ని అత‌ను తిరిగి అదే కుటుంబంలో పుట్టి తాను చేయాల్సిన ప‌నులు చేస్తాడ‌ట‌. ఇలా ఆ ప‌నులు పూర్త‌య్యే వ‌ర‌కు చ‌నిపోతూ పుడుతూనే ఉంటాడ‌ట‌. ఎప్పుడైతే ఆ ప‌నులు పూర్త‌వుతాయో అప్పుడు ఈ చ‌క్రం ఆగిపోతుంది. త‌రువాత ఆత్మ వేరే లోకాల‌కు వెళ్లిపోతుంది. ఇక కుటుంబ స‌భ్యులు త‌న‌కు చేయాల్సిన‌వి ఏమైనా బాకీ ఉన్నా వారు ఆ కుటుంబంలో పుడ‌తార‌ట‌. కుటుంబ స‌భ్యుల‌తో ప‌నులు చేయించుకుంటార‌ట‌. ఇది కూడా ఒక చ‌క్రంలా కొన‌సాగుతుంది. ఇలా ఈ చ‌క్రం ముగిసిన త‌రువాతే చ‌నిపోయిన వారి రుణం తీరుతుంద‌ట‌. అప్ప‌టి వ‌ర‌కు ఇలాగే జ‌రుగుతుంద‌ట‌. ఇలా ఈ రెండు కారణాల వ‌ల్లే చ‌నిపోయిన వారు తిరిగి అదే కుటుంబంలో పుడ‌తార‌ని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts