చిన్న పిల్లలు అన్నాక ఏడవడం సహజం. వారు ఆకలి వేసినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, అనారోగ్యంగా ఉన్నా.. బయటకు చెప్పలేరు కనుక.. ఏడుస్తారు. అయితే ఆకలి వేసినప్పుడు పాలను పట్టిస్తే సులభంగా ఏడుపు ఆపేస్తారు. కానీ కొన్ని సార్లు వారు అసలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. అలాంటప్పుడు కింద చెప్పిన చిట్కా పాటిస్తే వారు కేవలం 5 సెకన్లలోనే ఏడుపు ఆపేస్తారు. మరి ఆ చిట్కా ఏమిటంటే..
చిన్నారులు బాగా ఏడుస్తున్నప్పుడు పాల కోసం కాకపోతే.. ఏడుపును ఆపేందుకు ముందుగా వారి చేతులను ఛాతి మీదకు మడవాలి. తరువాత అరచేతిలో వారి కూర్చోబెట్టుకుని 45 డిగ్రీల కోణంలో వంచాలి. సున్నితంగా పిరుదుల మీద మర్దనా చేయాలి. ఆడిస్తున్నట్లు లాలించాలి. ఆ విషయాలను కింద ఇచ్చిన వీడియోలో చూసి తెలుసుకోవచ్చు.
డాక్టర్ రాబర్ట్ హామిల్టన్ అనే వైద్య నిపుణుడు చిన్నారులను ఏడుపు సులభంగా ఎలా మాన్పించాలో కనిపెట్టిన టెక్నిక్ ఇది. ఈ విధంగా చేయడం వల్ల పసిపిల్లలు సులభంగా ఏడుపు మానేస్తారు. కావాలంటే పాటించి చూడవచ్చు.