Instant Healthy Oats Breakfast : ఓట్స్‌తో అప్ప‌టిక‌ప్పుడు ఎంతో హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్‌ను ఇలా చేసుకోండి.. రుచిగా కూడా ఉంటుంది..!

Instant Healthy Oats Breakfast : ఓట్స్.. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్ లో ఫైబ‌ర్ తో పాటు ఎన్నో ర‌కాల మంచి పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బ‌రువు త‌గ్గుతారు. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గుండె ప‌నితీరు మెరుగుప‌డుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇలా ఓట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చేసే ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఉద‌యం స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, త‌రుచూ ఒకేర‌కం టిఫిన్స్ తిని బోర్ కొట్టిన వారు ఇలా ఓట్స్ తో రుచిగా, వెరైటీగా, ఆరోగ్యానికి మేలు చేసేలా బ్రేక్ ఫాస్ట్ ను త‌యారు చేసి తీసుకోవచ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్ తో రుచిగా బ్రేక్ ఫాస్ట్ ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఓట్స్ – ఒక క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – పావు క‌ప్పు, పెరుగు – పావు క‌ప్పు, నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, జీడిప‌ప్పు ప‌లుకులు – కొద్దిగా, అల్లం ముక్క‌లు – అర టీ స్పూన్, క్యారెట్ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – కొద్దిగా.

Instant Healthy Oats Breakfast recipe in telugu make in this method
Instant Healthy Oats Breakfast

ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఓట్స్ వేసి దోర‌గా వేయించాలి. ఇవి క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ర‌వ్వ వేసి వేయించాలి. దీనిని మ‌రో 2 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలాగా క‌లుపుకుని మూత పెట్టి 15నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, జీడిప‌ప్పు ప‌లుకులు, అల్లం ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత క్యారెట్ ముక్క‌లు, క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని నాన‌బెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. త‌రువాత కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. త‌రువాత అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని ఇడ్లీ మాదిరి త‌యారు చేసుకున్న త‌రువాత అప్పం లాగా వేసుకోవ‌చ్చు. లేదంటే పొంగ‌నాలుగా కూడా వేసుకోవ‌చ్చు. అప్పం లాగా వేసుకోవాల‌నుకున్న వారు ముందుగా పెనం మీద నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత పిండి తీసుకుని అప్పం లాగా వేసుకోవాలి. త‌రువాత మూత పెట్టి కింది వైపు ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. త‌రువాత దీనిని మ‌రో వైపుకు తిప్పి ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని చట్నీతో తిన్నా లేదా నేరుగా ఇలాగే తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఓట్స్ తో బ్రేక్ ఫాస్ట్ ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts