Instant Maida Dosa : అప్ప‌టిక‌ప్పుడు ఇలా దోశ‌ను ఇన్‌స్టంట్‌గా వేసుకోవ‌చ్చు.. ఎంతో మెత్త‌గా ఉంటుంది..!

Instant Maida Dosa : మ‌నం మైదాపిండితో కేక్స్, బిస్కెట్స్, రోల్స్ ఇలా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండితో చేసే వంట‌కాలు అప్పుడ‌ప్పుడూ తింటానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇన్ స్టాంట్ స్నాక్స్ తో పాటు మైదాపిండితో ఇన్ స్టాంట్ దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మైదాపిండితో అర‌గంట‌లో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఒకేర‌కం దోశ‌లు తిని తిని విసుగెత్తి పోయిన వారు, ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌వారు ఇలా ఇలా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇన్ స్టాంట్ గా మైదాపిండితో దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ మైదా దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – అర క‌ప్పు, మిరియాలు – అర టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 2, పెరుగు – అర క‌ప్పు, మైదాపిండి – అర క‌ప్పు, బియ్యం పిండి – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, నెయ్యి – 2 టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Instant Maida Dosa recipe in telugu make in this method
Instant Maida Dosa

ఇన్ స్టాంట్ మైదా దోశ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ప‌చ్చికొబ్బ‌రి ముక్క‌లు, మిరియాలు, ప‌చ్చిమిర్చి, త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో పెరుగు వేసి ఉండలు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత మైదాపిండి, బియ్యం పిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి పేస్ట్, ఉల్లిపాయ ముక్క‌లు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో తాళింపుకు నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఇంగువ‌, క‌రివేపాకు వేసి వేయించి పిండిలో వేసుకోవాలి.

త‌రువాత దీనిపై మూత పెట్టి పిండిని అర‌గంట పాటు పులియ‌బెట్టాలి. అర‌గంట త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. త‌రువాత పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి. ఇవి సాధార‌ణ దోశ‌లంగా పలుచ‌గా రావు. త‌రువాత‌ అంచుల చుట్టూ నూనె వేసుకుంటూ దోశ‌ను రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇన్ స్టాంట్ మైదా దోశ త‌యార‌వుతుంది. దీనిని ట‌మాట నిల్వ ప‌చ్చ‌డి, ఆవ‌కాయ‌, పండుమిర్చి ప‌చ్చ‌డితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా ఇలా అప్పుడ‌ప్పుడూ మైదాపిండితో కూడా రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts