Aloe Vera For Beauty : దీన్ని రాస్తే చాలు.. ముఖంపై ఒక్క‌డ ముడ‌త కూడా క‌నిపించ‌దు..!

Aloe Vera For Beauty : వ‌య‌సుపై బ‌డిన‌ప్ప‌టికి ముఖం అందంగా, కాంతివంతంగా, ముడ‌త‌లు ప‌డ‌కుండా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. దీని కోసం మార్కెట్ లో ల‌భించే క్రీముల‌ను, బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటాము. అయినా ఫ‌లితం లేక‌పోగా వీటిని వాడ‌డం వ‌ల్ల దుష్ప్ర‌భావాల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ర‌సాయ‌నాలు క‌లిగిన క్రీముల‌ను వాడ‌డానికి బ‌దులుగా స‌హ‌జ సిద్దంగా ల‌భించే క‌ల‌బంద‌ను వాడ‌డం వ‌ల్ల మనం మ‌న ముఖాన్ని అందంగా, కాంతివంతంగా, ముడ‌త‌లు ప‌డ‌కుండా కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. క‌ల‌బంద‌ను వాడ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు, ముడ‌త‌లు వంటి త‌గ్గి ముఖం అందంగా, కాంతివంతంగా త‌యారవుతుంది.

ముఖ్యంగా క‌ల‌బంద‌ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. క‌ల‌బంద‌లో గ్లూకోమెనాన్, గిబ్బ‌ర్లిన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి టైప్ 3 కొల్లాజెన్ ఉత్ప‌త్తిని పెంచి చ‌ర్మం బిగుతుగా త‌యారయ్యేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే చాలా మంది బ‌రువు త‌గ్గ‌డం వ‌ల్ల క‌డా చ‌ర్మం ముడ‌త‌లు ప‌డి వేలాడిన‌ట్టుగా ఉంటుంది. అలాంటి వారు కూడా క‌ల‌బంద‌ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం బిగుతుగా త‌యార‌వుతుంది. చ‌ర్మంపై ప‌డిన తొల‌గిపోతాయి. అయితే చ‌ర్మంపై ముడ‌త‌లు, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు క‌ల‌బంద‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. క‌ల‌బంద‌ను వివిధ ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ లో వాడ‌డం మ‌నం చూస్తూనే ఉంటాము.

Aloe Vera For Beauty how to use this for good results
Aloe Vera For Beauty

కానీ క‌ల‌బంద‌ను వివిధ ర‌కాలు ర‌సాయ‌నాల‌తో క‌లిపి వీటిని త‌యారు చేస్తారు. క‌నుక క‌ల‌బందను మ‌నం నేరుగా ఉప‌యోగించ‌డం మంచిది. తాజా క‌ల‌బంద గుజ్జును తీసుకుని చ‌ర్మంపై ముడ‌త‌లు ఉండే చోట అలాగే చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కూడ‌దు అనుకున్న చోట రాసుకోవాలి. ఈ క‌ల‌బంద గుజ్జు చ‌ర్మంలోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేసుకుని ఒక గంట పాటు అలాగే ఉండాలి. త‌రువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే ముడ‌త‌లు తొల‌గిపోతాయి. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా కూడా ఉంటుంది. అలాగే మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి ముఖం అందంగా, తెల్ల‌గా, కాంతివంతంగా త‌యార‌వుతుంది.

D

Recent Posts