Instant Palli Chutney : ఇన్‌స్టంట్ ప‌ల్లి చ‌ట్నీ.. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవ‌చ్చు.. నెల రోజులు నిల్వ ఉంటుంది..!

Instant Palli Chutney : మనం ఉద‌యం పూట ఇడ్లీ, దోశ‌, ఊత‌ప్పం వంటి అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిలోకి ప‌ల్లి చ‌ట్నీని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీ రుచిగా ఉంటేనే మ‌నం చేసే అల్పాహారాలు కూడా రుచిగా ఉంటాయి. కానీ చ‌ట్నీని త‌యారు చేయ‌డానికి కొద్దిగా స‌మ‌యం ఎక్కువ‌గానే ప‌డుతుందని చెప్ప‌వ‌చ్చు. ఉద‌యం పూట చ‌ట్నీని త‌యారు చేసే స‌మయం లేని వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారు ఇన్ స్టాంట్ ప‌ల్లి చ‌ట్నీ మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకుని పెట్టుకోవ‌డం వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఎంతో రుచిగా ప‌ల్లి చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఇన్ స్టాంట్ ప‌ల్లి చ‌ట్నీ మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ ప‌ల్లి చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక క‌ప్పు, ఎండు మిర్చి – 7 లేదా 8, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చింత‌పండు – 20 గ్రా., ఉప్పు – త‌గినంత‌.

Instant Palli Chutney make in this way
Instant Palli Chutney

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, శ‌న‌గ ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌.

ఇన్ స్టాంట్ ప‌ల్లి చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో పల్లీలను వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి చ‌ల్ల‌గా అయిన త‌రువాత పొట్టు తీసి పెట్టుకోవాలి.అదే క‌ళాయిలో ఎండు మిర్చిని, క‌రివేపాకును, జీల‌క‌ర్రను వేసి వేయించి చివ‌ర‌గా చింత‌పండును వేసి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఇప్పుడు జార్ లో వేయించి పెట్టుకున్న ప‌ల్లీల‌ను, ఎండు మిర్చి మిశ్ర‌మాన్ని వేయాలి. వీటితోపాటు వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు వేసి మెత్త‌ని పొడిలా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా త‌యారు చేసుకున్న ప‌ల్లి చ‌ట్నీ మిశ్ర‌మంలో వేసి క‌లిపి మూత ఉండే డ‌బ్బాలో ఉంచి ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఈ మిశ్ర‌మం నెల రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటుంది. మ‌న‌కు చ‌ట్నీ కావ‌ల్సిన‌ప్పుడు కావ‌ల్సిన ప‌రిమాణంలో ఈ మిశ్ర‌మాన్ని తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసుకుని క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే పల్లి చ‌ట్నీ త‌యార‌వుతుంది. ఉద‌యం పూట స‌మ‌యం లేని వారు అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఎంతో రుచిగా ఉండే ప‌ల్లి చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చట్నీని దోశ‌, ఇడ్లీ, ఊత‌ప్పం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts